మధ్య ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1188 (translate me)
చి Wikipedia python library
పంక్తి 16:
area_magnitude=11 |
population_year=2001 |
population=60,385,118 |
population_rank=7వ |
population_density=196 |
పంక్తి 27:
footnotes = |
}}
'''మధ్య ప్రదేశ్''' (Madhya Pradesh) ([[హిందీ]]:मध्य प्रदेश) - పేరుకు తగినట్లే [[భారతదేశం]] మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం [[భోపాల్]]. ఇంతకు పూర్వం దేశంలో వైశాల్యం ప్రకారం మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. కాని 2000 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను వేరుచేసి [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
 
== భౌగోళికం ==
పంక్తి 41:
 
== జిల్లాలు ==
మధ్య ప్రదేశ్‌లోని 48జిల్లాలను 9 డివిజన్‌లుగా విభజించారు. ఆ డివిజన్లు: [[భోపాల్]], [[చంబల్]], [[గ్వాలియర్]], [[హోషంగాబాద్]], [[ఇండోర్]], [[జబల్‌పూర్]], [[రేవా]], [[సాగర్]], [[ఉజ్జయిన్]].
{{:భారతదేశ జిల్లాల జాబితా/మధ్య ప్రదేశ్}}
 
== చరిత్ర ==
 
=== ప్రాచీన చరిత్ర ===
 
[[ఉజ్జయిని]] ("అవంతీ నగరం" అనికూడా పేరు) ఒకప్పటి "మాల్వా" రాజ్యానికి రాజధాని. క్రీ.పూ. 6వ శతాబ్దిలోనే భారతదేశంలో నగరాలు, నాగరికత రూపుదిద్దుకొటున్న సమయంలో ఇది ఒక ప్రధాన నాగరిక కేంద్రంగా వర్ధిల్లింది. ధానికి తూర్పున బుందేల్‌ఖండ్ ప్రాంతంలో "ఛేది" రాజ్యం ఉండేది. క్రీ.పూ. 320లో [[చంద్రగుప్త మౌర్యుడు]] ఉత్తరభారతాన్ని అంతటినీ [[మౌర్య సామ్రాజ్యం]] క్రిందికి తెచ్చాడు. అందులో ఇప్పటి మధ్యప్రదేశ్ అంతా కలిసి ఉంది. క్రీ.పూ. 321 నుండి 185 వరకు సాగిన మౌర్యసామ్రాజ్యం [[అశోక చక్రవర్తి]] అనంతరం పతనమయ్యింది. అప్పుడు మధ్యభారతంపై ఆధిపత్యంకోసం [[శకులు]], [[కుషాణులు]], స్థానిక వంశాలు పోరుసాగించాయి.
పంక్తి 55:
 
=== మధ్యయుగం చరిత్ర ===
"[[హూణులు|తెల్ల హూణుల]]" (Hephthalite) దండయాత్రలతో గుప్తసామ్రాజ్యం కూలిపోయింది. దానితో భారతదేశం చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. 528లో [[యశోధర్ముడు]] అనే మాళ్వా రాజు హూణులను ఓడించి, వారి రాజ్యవిస్తరణకు అడ్డుకట్టవేశాడు. [[తానేసార్]]‌కు చెందిన [[హర్షుడు]] అనే రాజు ఉత్తరభారతాన్ని కొద్దికాలం ఒకటిగా చేయగలిగాడు. ఆయన 647లో మరణించాడు. తరువాతికాలంలో [[రాజపుత్రులు|రాజపుత్ర వంశాల]] ప్రాభవం మొదలయ్యింది. మాళ్వా [[పారమారులు]], బుందేల్‌ఖండ్ [[చందేలులు]] వీరిలో ముఖ్యులు. సుమారు 1010-1060 మధ్య పాలించిన పారమఅర రాజు [[భోజుడు]] గొప్ప రచయిత, విజ్ఞాని (polymath). 950-1050 మధ్యలో చందేలులు [[ఖజురాహో]] మందిరాలను నిర్మించారు.
 
 
పంక్తి 67:
 
 
ఆ కాలంలో [[బ్రిటిష్‌వారు]] [[బెంగాల్]], [[బొంబాయి]], [[మద్రాసు]]లలో స్థావరాలు ఏర్పరచుకొని భారతదేశంలో తమ అధీనాన్ని విస్తరించుకొనసాగారు. తత్కారణంగా 1775 - 1818 మధ్య మూడు [[ఆంగ్ల-మరాఠా యుద్ధాలు]] జరిగాయి. మూడవ యుద్ధం తరువాత బ్రిటిష్‌వారి అధిపత్యానికి దాదాపు ఎదురులేకుండా పోయింది. మహాకోసల ప్రాంతం (సౌగార్, నెర్బుద్ద విభాగాలు) బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోయింది. దీనిని మధ్య పరగణాలు (Central Provinces) అని పిలచేవారు. ఇండోర్, భోపాల్, నాగపూర్, రేవా, మరి చాలా చిన్న సంస్థానాలు బ్రిటిష్‌వారికి లోబడిన రాజ్య సంస్థానాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఉత్తరభాగరాజసంస్థానాలు Central India Agency పాలనలో నడచేవి.
 
=== స్వాతంత్ర్యానంతర చరిత్ర ===
 
1950లో [[నాగపూర్]] రాజధానిగా - మధ్యపరగణాలు, బేరార్, మక్రాయ్ సంస్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లను కలిపి - మధ్యప్రదేశ్‌ను ఏర్పరచారు. Central India Agency ప్రాంతాన్ని [[మధ్యభారత్]], [[వింధ్యప్రదేశ్]]‌రాష్ట్రాలుగా ఏర్పరచారు. 1956లో భోపాల్, మధ్యభారత్, వింధ్యభారత్‌లను కలిపి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. [[మరాఠీ భాష]] మాట్లాడే దక్షిణప్రాంతమైన [[విదర్భ]]ను , నాగపూర్‌తో సహా, వేరుచేసి [[బొంబాయి రాష్ట్రం]]లో కలిపారు.
 
 
"https://te.wikipedia.org/wiki/మధ్య_ప్రదేశ్" నుండి వెలికితీశారు