మృత్తికలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
మానవుడి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో '''నేలలు''' లేదా '''మృత్తికలు''' ముఖ్యమైనవి. భూ ఉపరితలంలోని సారవంతమైన సన్నటి పొరే నేల. వ్యవసాయాభివృద్ధిలో నేలలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వృక్షసంపద , పంటల ఉత్పత్తికీ తద్వారా సకల ప్రాణుల జీవనానికి మృత్తిక అవసరం. ఇది గతిశీలమైన [[ప్రకృతి వనరు]].
==రకాలు==
నేలలు లేదా మృత్తికల అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ అనీ మృత్తికా నిర్మాణ ప్రక్రియను పెడోజెనిసిస్ అని అంటారు. స్వభావం, రంగు, వాటి రసాయన ధర్మాలను ఆధారంగా చేసుకుని భారత వ్యవసాయ పరిశోధన మండలి భారతదేశంలో నేలలను 8 రకాలుగా విభజించింది.<ref>ఈనాడు ప్రతిభ వ్యాసం, అక్టోబర్ 6, 2009 </ref>
అవి
#'''ఒండలి నేలలు''': ఇవి భారతదేశంలో దాదాపు 45 శాతం ఆక్రమించి ఉన్నాయి. నేలలన్నింటిలోకి అత్యంత సారవంతమైనవి. నదులు తెచ్చే అవక్షేప పదార్థాలు నిక్షేపితం కావడంతో ఏర్పడ్డాయి.
#'''నల్లరేగడి నేలలు''': ఇవి బసాల్ట్ శిలలు విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడతాయి. వీటికి నలుపు రంగు రావడానికి కారణం అందులో కరిగే ఉండే ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్ లు. ఇవి [[మహరాష్ట్ర]], [[గుజరాత్]], [[మధ్యప్రదేశ్]], [[కర్ణాటక]], [[ఆంధ్రప్రదేశ్]], [[తమిళనాడు]], [[రాజస్థాన్]] లోని దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. వీటినే స్థానికంగా రేగడి నేలలు అనికూడా అంటారు.
#'''ఎర్ర నేలలు''': గ్రానైట్, నీస్ లాంటి శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడ్డాయి. ఇవి ఎర్రగా ఉండటానికి ప్రధాన కారణం అందులో కరిగి ఉండే ఫెర్రిక్ ఆక్సైడ్ లు
"https://te.wikipedia.org/wiki/మృత్తికలు" నుండి వెలికితీశారు