యాంటి ఆక్సిడెంట్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''ఆంటీఆక్సిడెంట్''' ([[ఆంగ్లం]]: Antioxidant) అనగా ఇతర రసాయన పదార్థాల ఆక్సీకరణాన్ని నిరోధించే ప్రదార్థం.
[[Image:Antioxidant.png|thumb|right|250px|గ్యాసోలిన్(పెట్రోలు) లో జిగురు ఏర్పడుటను నిరోధించుటకు ఉపయోగపడే సాధారణ ఆక్సీకరణులు అయిన ప్రత్యామ్నాయ ఫీనాళ్ళు మరియు వాటి ఉత్పన్నాలు ]]
[[Image:L-ascorbic-acid-3D-balls.png|thumb|right|నిరోధక ఆక్సీకరణి ఆక్సార్బిక్ ఆమ్లము (విటమిన్ సి) యొక్క నిర్మాణం]]
[[Image:Lipid peroxidation.svg|thumb|right|లిపిడ్ పెట్రో ఆక్సీకరణం యొక్క స్వేచ్ఛా రాడికల్ విధానం]]
పంక్తి 19:
==వ్యాధుల నుంచి రక్ష==
యాంటీ ఆక్సిడెంట్స్ (నిరోధక ఆక్సీకరణులు) అనేక వ్యాధుల నుంచి మన దేహాన్ని రక్షిస్తాయి. ప్రధానంగా రెండు రకాలుగా ఇవి శరీరంలోని కణాలను కాపాడతాయి. ఒకటి పోషకాల రూపంలో తీసుకున్నప్పుడు అంటే విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) గా స్వీకరించినప్పుడు. దాంతోపాటు ప్రోటీన్ల రూపంలోని కొన్ని పోషకాలు మన దేహంలోకి వెళ్లాక రసాయనికచర్యల తర్వాత ఎంజైములుగా మారి కూడా కణాల పాలిట శ్రీరామరక్షగా ఉంటాయి. ఇలా ఈ రెండు తరహాల్లో అవి మనల్ని ఏ క్యాన్సర్ ఏ గుండెజబ్బులు (రక్త ప్రసరణ వ్యవస్థ) , ఏ పక్షవాతం(స్ట్రోక్), ఏ అల్జైమర్స్ ఏ వ్యాధినిరోధకశక్తి లోపంతో వచ్చే జబ్బులు ఏ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏ క్యాటరాక్ట్... వంటి ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి.
==యాంటీ ఆక్సిడెంట్స్ పనితీరుకు ఒక ఉదాహరణ==
పంక్తి 39:
బాదం, ఆక్రోట్, వేరుశనగ గింజలు వంటి వాటిల్లో విటమిన్ ‘ఇ’ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాలను దెబ్బ తినకుండా రక్షించి, వయసు పైబడనివ్వకుండా చేస్తుంది. అంతేకాదు.. క్యాన్సర్, గుండెజబ్బులు, క్యాటరాక్ట్ వంటి జబ్బుల నుంచి కాపాడుతుంది. విటమిన్ ‘ఇ’ మరో విటమిన్ అయిన ‘సి’తో కలిసి కొన్ని దీర్ఘకాలిక జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
;'''బెర్రీ పండ్లు :'''
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో యాంథోసయనిన్, హైడ్రాక్సిసిన్నమిక్ ఆసిడ్, హైడ్రాక్సీబెంజోయిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు, విటమిన్‌‘సి’ పుష్కలంగా ఉంటాయి. ఇది అన్ని యాంటీ ఆక్సిడెంట్స్‌లలోకెల్లా ప్రభావవంతమైనది. పై పోషకాలన్నీ కలిసి మన శరీరానికి ఎన్నో విధాల రక్షణను, ఆరోగ్యాన్నీ సమకూరుస్తాయి. ఎన్నో ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడతాయి. మన దేహంలోని కండరాలు, ఎముకలతో బలంగా పట్టి ఉంచేందుకు దోహదపడే కొలాజెన్ ఉత్పాదనకు తోడ్పడతాయి. మన రక్తనాళాలన్నీ చివరల వరకూ మూసుకుపోకుండా సంరక్షిస్తూ... ఏదైనా గాయం అయినప్పుడు వెంటనే మానేందుకు ఉపకరిస్తాయి. అంతేకాదు... పై పోషకాలు ఇనుము, ఫోలేట్ అనే పోషకాలు మన దేహంలోకి వేగంగా ఇమిడిపోయేలా చేస్తాయి.
;'''ద్రాక్షపండ్లు :'''
ఈ పండ్లలో ‘రిస్వెరట్రాల్’ అనే పోషకం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సమర్థంగా ఉపయోగపడుతుంది. మనం చాలా ప్రభావవంతమైన విటమిన్ ‘సి’తో పోల్చినా ద్రాక్షలో ఉండే రిస్వెరట్రాల్ పోషకం హాని చేసే కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పట్ల దాదాపు 10 నుంచి 20 రెట్లు అధిక ప్రభావపూర్వకంగా పని చేసి చాలా వేగంగా దాన్ని నిర్వీర్యం చేస్తుంది. అందుకే ద్రాక్షపండ్లు గుండెజబ్బులు రాకుండా రక్షణ కల్పిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/యాంటి_ఆక్సిడెంట్" నుండి వెలికితీశారు