లక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox actor
| name =లక్ష్మి
| image = Lakshmi actress.jpg
| imagesize =
| caption =
| birthdate = {{Birth date and age |1952|12|13}}
| location = {{flagicon|India}} [[మద్రాసు]]
[[తమిళనాడు]]
[[భారతదేశం]]
| height = 5"7
| deathdate =
| deathplace =
| birthname = లక్ష్మి ఎర్రగుడిపాటి
| othername = లక్ష్మీ నారాయణ్
| homepage =
| notable role = [[మురారి]]
[[మిథునం]]
[[జీవనతరంగాలు]]
| spouse = భాస్కర్ (మొదటి భర్త)
మోహన్ (రెండవ భర్త)
శివచంద్రన్ (మూడవ భర్త)

'''లక్ష్మి''' సుప్రసిద్ధ దక్షిణ భారతీయ నటీమణి. ఈమె సుప్రసిద్ధ సినీ ప్రముఖుడు [[వై.వి.రావు]] మరియు [[వై.రుక్మిణి]]ల పుత్రిక. లక్ష్మి తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో [[1952]], [[డిసెంబరు 13]]న మద్రాసులో జన్మించింది.

==సినిమా వ్యాసంగం==
లక్ష్మి 1975లో విజయవంతమైన హిందీ చిత్రం జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది. ఆ సినిమాలో లక్ష్మి నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నది.<ref>[http://deep750.googlepages.com/FilmfareAwards.pdf 1st Filmfare Awards 1953]</ref>

ఈమె తండ్రి వై.వి.రావు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నటుడు అనేక ప్రముఖ సాంఘీక విషయాలపై ఆధారితమైన సినిమాలను నిర్మించాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm</ref> ఈమె తల్లి రుక్మిణి తమిళ నటి. అమ్మమ్మ నుంగబాక్కం జానకి కూడా నటే. కళాకారుల కుటుంబంలో జన్మించిన లక్ష్మి మూడవ తరము నటి. 15 యేళ్ల వయసులోనే సినీరంగంలో ప్రవేశించింది. ఈమె తొలి సినిమా 1968 లో విడుదలైన తమిళ సినిమా "జీవనాంశమ్". 1970వ దశకంలో తారగా వెలుగొందిన లక్ష్మి దక్షిణ భారత భాషలన్నింటిలో నటించింది. ఈమె నటించిన మలయాళంలో విజయవంతమైన చట్టకారి (1974) చిత్రాన్ని హిందీలో జూలీ (1975) అనే పేరుతో, తెలుగులో "మిస్ జూలీ ప్రేమకథ" (1975) గా పునర్నిర్మించి విడుదల చేశారు. జూలీ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు బెంగాళీ సినీ పాత్రికేయ సంఘం యొక్క "సంవత్సరపు ఉత్కృష్ట నటన" పురస్కారాన్ని అందుకున్నది. <ref>[http://www.bfjaawards.com/legacy/pastwin/197639.htm 69th & 70th Annual Hero Honda BFJA Awards 2007]</ref> జూలీ చిత్రం యొక్క విజయం తర్వాత లక్ష్మి మరే హిందీ చిత్రంలోనూ నటించక దక్షిణాది భాషల సినిమాలపైనే దృష్టిపెట్టింది. 1977లో విడుదలైన తమిళ సినిమా శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ లో నటనకు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకొని ఆ పురస్కారం తమిళ సినిమాకై అందుకొన్న దక్షిణాదికి చెందిన తొలి నటి అయ్యింది. 1980లలో కథానాయకి పాత్రలు కరువైన తరుణంలో తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలలో సహాయనటిగా చేయటం ప్రారంభించింది. జీన్స్ (1998) చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బామ్మ గానూ, హల్‌చల్ (2004) లో కరీనా కపూర్ బామ్మగానూ నటించింది. 400కు పైగా సినిమాలు చేసిన లక్ష్మి, రాజకీయాలలో కూడా అడుగుపెట్టింది.
==వ్యక్తిగత జీవితము==
ఈవిడ మూడుసార్లు వివాహము చేసుకున్నది. పదిహేడేళ్ళపుడు పెద్దలు కుదిర్చిన సంబంధము ద్వారా భాస్కర్ ను వివాహం చేసుకుంది. ఇతను ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసేవాడు. ఇతని ద్వారా 1971 లో కుమార్తె '''ఐశ్వర్య ''' జన్మించింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు.తర్వాత తన సహనటుడు మోహన్ ను పెళ్ళి చేసుకుంది. వీరిద్దరూ కూడా త్వరలోనే విడిపోయారు. తర్వాత నటుడు మరియు దర్శకుడు ఐన శివచంద్రన్ ని పెళ్ళాడింది. కన్నడ నటుడు [[అనంత్ నాగ్]] తో కూడా కొద్దికాలం సన్నిహితంగా మెలిగింది.

==నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)==
పంక్తి 47:
[[వర్గం:1952 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]
[[వర్గం:కన్నడ సినిమా నటీమణులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/లక్ష్మి_(నటి)" నుండి వెలికితీశారు