వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7916831 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2:
 
 
క్రీస్తుశకము 1413 నుండి తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన వాసిరెడ్డి వంశమునకు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. కృష్ణా మండలములోని [[చింతపల్లి]] వీరి రాజధాని. వాసిరెడ్డి వంశము వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి బ్రిటిషు వారికి సామంతులుగ వుండిరి. వేంకటాద్రి రాజధానిని క్రిష్ణానది ఆవల ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోట కు మార్చినాడు. వేంకటాద్రి గొప్ప కవి పండిత పోషకుడు మరియు మంచి పరిపాలనాదక్షుడు. [[పిండారీ]] దండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు<ref>The Journal of Asian Studies
Association for Asian Studies, 1965, Vol. 24, No. 1, p. 296, ISSN 0067-7159</ref>.
 
 
కృష్ణా డెల్టా ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి. వేంకటాద్రి నాయుని సైన్యములో వేలమంది సైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనని ఎడ్లబండ్లు ఉండేవి. అమరావతి, చేబ్రోలు, చింతపల్లిలలో నాయుని భవనములు సంపదతో తులతూగేవి. పండుగలనాడు పండితులకు, గ్రామపెద్దల కుటుంబాలకు పట్టువస్త్రములు, బంగారు ఆభరణములు బహూకరించబడుతుండేవి. నిరతాన్నదానములు జరుగుతుండేవి.
 
 
పంక్తి 12:
 
 
బ్రిటీషు ప్రభుత్వము నాయనింగారి సైనికులను నిరాయుధులను చేసింది. ఆగ్రహించిన నాయుడు చింతపల్లిని విడచి గుంటూరు మండలములోని ధరణికోట వద్ద అమరావతియను పట్టణము, భవనాలు కట్టించాడు. 1797లో [[అమరావతి]] పట్టణము దర్శించిన [[కోలిన్ మెకంజీ]] అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధములుగా పొగిడాడు<ref>Indian Monuments, N. S. Ramaswami, 1971, Abhinav Publications, ISBN 0896840913, ప్. 115</ref>.
 
 
వేంకటాద్రి పాలనలో [[చెంచులు]] దారిదోపిడులు చేయుచు సామాన్య ప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]] గా మారింది. పిమ్మట బహుపశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో [[మంగళగిరి]] నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే '''బేతవోలు''' అనే గ్రామం పేరును [[జగ్గయ్యపేట]] గా మార్చాడు. ఆయన తల్లి అచ్చమ పెరు మెదనె అచ్చమ్మపెట గా మారినది. వేంకటాద్రి నాయుడు [[1817]], [[ఆగష్టు 17]]న మరణించాడు.