సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 5:
| image = SATYAMURTHY_PHOTO_FOR WIKIPEDIA.JPG
| imagesize = 150px
| caption = '''సత్యమూర్తి'''
| birth_name = భావరాజు వెంకటసత్యమూర్తి
| birth_date = [[జనవరి 1]], [[1939]]
| birth_place = [[రామచంద్రపురం]] [[తూర్పు గోదావరి జిల్లా]]
| native_place =
పంక్తి 24:
| boards =
| religion =
| spouse = జోగేశ్వరి
| partner =
| children = శ్రీ పద్మావతి, సాయి భాస్కర్
| father = రావు సాహెబ్ భావరాజు సత్యనారాయణ
| mother = వెంకాయమ్మ
| website =
| footnotes =
| employer = సత్యసాయి డిజైనింగ్ స్టుడియోస్ (ప్రై)లిమిటెడ్‌
| footnotes =
| height =
పంక్తి 38:
 
[[ఫైలు:CHADUVULRAAV_BY_SATYAMURTHY.jpg|150px|left|thumb|'''సత్యమూర్తి సృష్టించిన పసిద్ధిగాంచిన ''చదువుల్రావు''''']]
'''సత్యమూర్తి''' గా దశాబ్దాల నుండి వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి. పేరులోని "సత్యమూర్తి" ని కలంపేరుగా ధరించి, [[తెలుగు]] పాఠకలోకానికి కార్టూనిస్టుగా చిరపరిచితులయ్యాడు. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కార్టూన్ పాత్ర '''చదువుల్రావు''' ఇతడి సృష్టే. తెలుగు కార్టూనిస్టులలో ఎంతో అనుభవశాలిగా, సీనియర్‌గా గౌరవం పొందుతుతూ, తన కార్టూనింగును కొనసాగిస్తున్నాడు.
 
==వ్యక్తిగతం==
ప్రపంచం అంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వేళ, [[జనవరి 1]], [[1939]]న జన్మించాడు. ఇతని తండ్రి భావరాజుసత్యనారాయణ ఇంజనీరు మరియు "రావు సాహెబ్" బిరుదాంకితుడు. తల్లి పేరు వెంకాయమ్మ. సత్యమూర్తి చదువు పి.ఆర్‌.కాలేజీ,కాకినాడలో మొదలయ్యింది. ఇంటర్‌మీడియేట్‌ అక్కడ పూర్తిచేసుకుని, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(Bachelor of Arts-B.A.)మరియు ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్(Bachelor of Laws-LLB)పూర్తి చేశాడు. ఆ తరువాత, తన అభిరుచి ప్రకారం ఫైన్ ఆర్ట్ కాలేజి(College of Fine Art),హైదరాబాదు నుండి అప్లైడ్ ఆర్ట్స్ (Applied Arts) అభ్యసించాడు.
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
తన చిన్న వయస్సులోనే, ఇతను [[1958]]నుండి వ్యంగ్య చిత్రాలు వేయటం మొదలు పెట్టాడు. ఇతను వేసిన వ్యంగ్య చిత్రాలు చక్కగా చెక్కినట్లు ఉంటాయి. గీసిన పాత్రలన్నీ సందర్భానికి సరిపోయ్యేట్టుగా ఉంటాయి. సందర్భానుసారం మరొకరకంగా వెయాల్సి వస్తే తప్ప,సామాన్యంగా బొమ్మలన్నీ కూడా అందంగా వేస్తాడు. బొమ్మలలో చక్కటి నైపుణ్యం, నాణ్యం తొణికిసలాడుతుంటాయి. వేసిన బొమ్మలకు సరిపొయ్యే హాస్య ప్రధానమైన సంభాషణలు చక్కటి తెలుగులో వ్రాయటం ఇతని ప్రత్యేకత.
 
==వ్యంగ్య చిత్రాలు పత్రిక ముఖ చిత్రాలుగా==
సామాన్యంగా అందమైన తారామణుల చిత్రాలను ఎక్కువగా పత్రికలు ముఖ చిత్రాలుగా వేస్తాయి. అప్పట్లో ([[1960]], [[1970]] దశకాలలో) యువ మాస పత్రిక ఒక్కటే సినిమాకు సంబంధించని ముఖ చిత్రాలు ప్రచురించేవారు. సామాన్యంగా [[వడ్డాది పాపయ్య]] ఈ చిత్రాలు వేస్తూ ఉండేవాడు. కాని సత్యమూర్తి నైపుణ్యాన్ని గమనించి, ఇతని వ్యంగ్యచిత్రాలను ముఖచిత్రాలుగా [[ఆంధ్ర పత్రిక]] ప్రచురించటం ముదావహం, అది కూడా 23 సంవత్సరాల పిన్న వయస్సులో ఇతను వేసిన వ్యంగ్యచిత్రాలతో ఏకంగా తమ పత్రిక ముఖ చిత్రం వేయటం ఇతడి కార్టూనింగ్ నైపుణ్యానికి ఒక మచ్చు తునక. ఆ తరువాత ఆంధ్ర ప్రభ దీపావళి సంచికకు ఇతడి కార్టూన్లతో ముఖచిత్రం ప్రచురించింది.
 
==రచనా వ్యాసంగం==
పంక్తి 53:
కార్టూన్లు వేయ్యటమే కాకుండా అనేక రచనలు కూడ చేశాడు, పుస్తకాలకు ముఖచిత్రాలు కూడ చిత్రించాడు. వాటిలో కొన్ని:
===బొమ్మలు===
* భగవాన్ సత్యసాయి మీద వ్రాయబడిన అనేక పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశాడు.
* సనాతన సారధి పత్రిక మరియు ఆంగ్ల పత్రిక భావాన్స్ జర్నల్(Bhavans Journal)లోను, భగవాన్ సత్య సాయి బాబా కథలకు బొమ్మలు వేశాడు.
===పుస్తకాలు===
* కార్టూన్లు వెయ్యటం ఎలా అన్న విషయం మీద ఆంధ్రభూమి వారపత్రికలో రెండు సంవత్సరాలపాటు ధారావాహిక రచించి, ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు ఎంతగానో తోడ్పడ్డాడు. ఈ ధారావాహిక సంకలనంగా తెలుగులో ప్రచురించబడింది. ఇదే పుస్తకం ఇంగ్లీషులో హౌ టు డ్రా ఎ కార్టూన్(How to Draw a Cartoon)మరియు హిందీలో కార్టూన్ కైసె బనాయే (कार्टून कैसे बनाए) అన్నపేరుతో ప్రచురించబడింది.
*శ్రీ సత్యసాయి మీద అనేక పుస్తకాలు
*భగవాన్ సత్య సాయి వారి ఉపన్యాసాల ఆధారంగా చిన్న కథలను 10 సంపుటాల రచిచంచాడు.
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు