సామెతలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{తెలుగుభాషాసింగారం}}
'''సామెతలు''' లేదా '''లోకోక్తులు''' (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ''"సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు"'' అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను '''byword''' లేదా '''nayword''' అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని "సూక్తులు", "జనాంతికాలు", "లోకోక్తులు" అని కూడా అంటుంటారు.
 
 
పంక్తి 11:
 
 
ప్రజా బాహుళ్యంలో ఎక్కువగా ప్రచారంలో ఉండి, మరల మరల వాడబడే వాక్యాలు లేదా పదజాలాలు సామెతలు అవుతాయి. ఇవి సాధారణంగా సరళమైన భాషలో ఉంటాయి. ఎక్కువ మందికి తెలిసి ఉంటాయి (అంటే సామెత చెప్పిన వ్యక్తి దాని అర్ధాన్ని వివరించనక్కరలేదు). అనుభవాత్మకంగా గాని, సామాన్య జ్ఞానంతో గాని తెలిసిన విషయం సామెతలో కొన్నిమార్లు సూటిగాను, కొన్నిమార్లు అన్యాపదేశంగాను, కొన్నిమార్లు సోదాహరణంగాను చెప్పబడుతుంది. పదాల కూర్పులో పొందిక గాని లయ గాని ఉండడం కద్దు. సామెత ప్రధానంగా సూటిగా నీతిని బోధించేదయితే దానిని "సూక్తి" లేదా "నీతి వాక్యము" అంటారు. మరీ చిన్నవైన వాక్యాలు (రెండు మూడు పదాలు మాత్రమే) ఉంటే అది "[[జాతీయము]]" కూడా కావచ్చును.
 
 
"లోకోక్తి" పదాన్ని తెలుగులో "నానుడి" అని, తమిళంలో "పళమొళి", పంళచొళ్ళు" అని, కన్నడంలో "నాన్నుది" అని అంటారు. ఇవన్నీ "జనుల మాట" అన్న అర్ధాన్నే ఇస్తాయి. <ref name="saati"> '''సాటి సామెతలు''' (తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ భాషలలో సమానార్ధకాళున్న 420 సామెతలు) - సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కె. నాయర్ [http://www.archive.org/details/saatisamethalu022732mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref> కనుక సామెతలు అంటే "పదుగురాడు మాట", "జనుల నోట నానిన మాట" అని చెప్పవచ్చును.
 
 
సామెతల వినియోగం సందర్భానుసారంగా వివిధ ఫలితాలనిస్తుంది. ఒకోమారు కటువైన విషయాన్ని సామెతల ద్వారా మెత్తగా చెప్పవచ్చును. ఒకోమారు ఒక వ్యక్తి తన బలహీనమైన వాదానికి తరతరాల అనుభవాన్ని జోడించిన బలం పొందగలుగుతాడు. ఒకోమారు సంభాషణకు కాస్త చైతన్యం లభిస్తుంది. ఉపన్యాసకులు సామెతల ద్వారా తమ ప్రసంగాన్ని రక్తికట్టించగలుగుతారు. సామెతల అధ్యయనం అనేక ప్రయోజనాలకు వాడుతారు - జానపద సాహిత్యం అధ్యయనం చేసేవారికి ఇది చాలా ఆసక్తిదాయకమైన అంశం. ప్రజల నాగరికతలో వచ్చిన మార్పులు, వలస వెళ్ళినవారు క్రొత్త సమాజంలో ఇమిడిన తీరు, ప్రకటనలలో ఆకర్షణ, పాఠ్యాంశాల బోధనలో మెళకువలు - ఇలా అనేక ప్రయోజనాలున్నాయి.
 
 
సామెతలు అధికంగా ప్రజల జీవనం నుండి, అనుభవంనుండి పుడతాయి. కాని సాహిత్యంనుండి, మత గ్రంధాల నుండి, రాజకీయ నేపధ్యంనుండి కూడా పుట్టవచ్చును. కొన్ని [[తెలుగు సినిమా పేలిన డైలాగులు]] కూడా తెలుగులో సామెతలకు సమాన స్థాయిని సాధించి చలామణిలో ఉన్నాయి ("సాహసము సేయుమురా డింభకా", "మడిసన్నాక కుసంత కలాపోసనుండాలి. తిని తొంగింటే మడిసికీ గొడ్డుకూ తేడా యేటుంటుంది?", "ఒకసారి కమిటయ్యాక నా మాట నేనే వినను")
 
== సామెతలు ఎలా వస్తాయి ==
పంక్తి 48:
 
=== స్త్రీల గురించి ===
తెలుగు సామెతలలో చాలా భాగం స్త్రీల గురించి ఉన్నాయి. "సామెతలు ఆడువారి సొత్తు. చాలా సామెతలు స్త్రీలే కల్పించియుందదురని నా నమ్మకం. వాడుకలో కూడా చాలా వరకు స్త్రీల నోటనే సామెతలు వస్తుంటాయి." అని లోకోక్తముక్తావళి సంకలనకర్త అన్నాడు.<ref name="krishna"/>
 
ఇదే భావాన్ని కోకా విమల కుమారి అనే రచయిత చెప్పింది - నిత్యజీవితంలో ఎక్కువగా పురుషులకంటే స్త్రీలే సామెతలను వాడుతూ ఉంటారు. - "తలలు బోడులైతే తలపులు బోడులా!" ఈ సామెత యవ్వనంలో వున్న స్త్రీలనుద్దేశించి చెప్పబడింది. "కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండదు" ఇంటికి మహాలక్ష్మిలాంటిది ఇల్లాలు. అలాంటి ఇల్లలు ఏడుస్తూ కూర్చుంటే ఆ ఇంట్లో సిరి సంపదలు కరువైపోతాయట. . "ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమన్నారు" అనే సామెతలో ఇంటి పరిసరాలు, వాతావరణం పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంటి ఇల్లాల్ని కూడ పరిశుభ్రతకు ప్రతీకగా మంచితనానికి మారుపేరుగా పరిగణించవచ్చును. సామెతల వాజ్ఙయంలో అత్తగారికి సంబంధించిన సామెతలు అనేకం. "అత్తలేని కోడలుత్తమురాలు - కోడలు లేని అత్త గుణవంతురాలు" ఇందులో ఒకటి. "అత్త ఏలిన కోడలు చిత్తబట్టిన వరి" అంటే అత్తింట్లో అందర్నీ మెప్పిస్తూ తెలివిగా కాపురం చేసిన కోడలు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనగల శక్తి, సామర్ధ్యాన్ని కలిగివుంటుందని అర్ధం. "అత్తగారింటి సుఖం మోచేతి దెబ్బవంటిది" అత్తగారింట్లో సుఖపడ్తున్నాని కోడలు అనుకున్నా అది మోచేతికి తగిలిన గాయంలా ఉండీ ఉండీ బాధపెడ్తూనే ఉంటుంది. "అత్తపేరు పెట్టి కూతుర్ని కుంపట్లో తోసిందట" అత్త మీద ఉన్న కోపం ఆమె పేరున్న కూతురుపై చూపడం అంటే ఆ కోడలికి అత్తమీద ఎంతటి ద్వేషం ఉందో తెలుస్తూనే ఉంది. "అంగడి మీద చేతులు అత్త మీద కన్ను", "అత్తను కొడితే కోడలు ఏడ్చిందట" ఇలా అత్తకు సంబంధించిన సామెతలు అనేకం. ."రొద్దానికి ఎద్దును పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు" అనేది ఒక సమస్యాయుత సామెత. పెనుగండ ప్రాంతంలో బావులు చాలా లోతుగ వుంటాయి గనుక నీళ్ళు తోడడం చాలా కష్టమనీ, అందుకే అలాంటి వారితో పిల్లనిచ్చి వియ్యమందకూడదనీ, మెరక సేద్యం చేయడం కష్టం కనక అలాంటి ప్రదేశాలకు ఎద్దుల్ని పంపించకూడదనీ ఒక నమ్మకం ఇండేది. - "కూతురు కనలేకపోతే కొడుకు మీద విరుచుకుపడ్డాట్ట", "కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకేడ్చిందట", "సారె పెట్టకుండా పంపేను కూతురా, నోరుపెట్టుకుని బ్రతకమందట", "కాలు జారితే తీసుకోవచ్చుగానీ నోరు జారితే తీసుకోలేము" <ref>తెలుగు సామెతల్లో స్త్రీ - కోకా విమల కుమారి -[http://www.telugudanam.co.in/saahityam/Telugu_sametaloa_stree.htm తెలుగుదనం]</ref>
 
=== వ్యవసాయం గురించి ===
పంక్తి 104:
 
== ఇవి కూడా చూడండి ==
* [[సామెతల జాబితా]]
* [[తెలుగు సినిమా పేలిన డైలాగులు]]
 
పంక్తి 125:
* "తెలుపు" సైటులో http://www.telupu.com/sametalu.html
* "సామెతలు" సైటులో -http://www.saamethalu.com/
* "ఆంధ్ర లోకోక్తి చంద్రిక" గూగుల్ బుక్స్ సైటులో -http://books.google.com/ebooks?id=VnUIAAAAQAAJ
 
; వివిధ భాషలలో సామెతలు
"https://te.wikipedia.org/wiki/సామెతలు" నుండి వెలికితీశారు