సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3764165 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
[[File:Muḥammad or Sultan Mahmud.jpg|thumb|సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా]]
'''సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా''' [[గోల్కొండ]]ను పరిపాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీ వంశము]]నకు చెందిన ఆరవ చక్రవర్తి. ఈయన [[1612]] నుండి [[1626]] వరకు పరిపాలించాడు. ఈయన తనకు ముందు పరిపాలించిన [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] సోదరుడైన మీర్జా మహమ్మద్ అమీన్ కుమారుడు{{చూడు|ref1}}. ఈయన తండ్రి 25 సంవత్సరాల వయసులోనే మరణించాడు. తల్లి ఖానుమ్ ఆఘా, మా సాహెబా చెరువును కట్టించినది.
 
కులీ కుతుబ్ షాకు మగ సంతానము లేనందున తన కూతురు [[హయాత్ బక్షీ బేగం]] ను మహమ్మద్ కుతుబ్ షాకు ఇచ్చి వివాహము చేసి తన వారసునిగా ప్రకటించాడు. మహమ్మద్ కుతుబ్ షాకు ముగ్గురు కుమారులు మరియు కుమార్తెలు. వీరిలో ఏడవ సుల్తాన్ [[అబ్దుల్లా కుతుబ్ షా]] కూడా ఒకడు.
పంక్తి 6:
[[హైదరాబాదు]]లోని [[మక్కా మసీదు]] యొక్క నిర్మాణము [[1617]]లో ఈయన హయాములోనే దరోగా మీర్ ఫైజుల్లా బేగ్ మరియు చౌధరీ రంగయ్య నేతృత్వములో ప్రారంభమైనది. సుల్తాను మసీదు నిర్మాణ శంకుస్థాపనకు నగరములో అందరు మత పెద్దలను పిలిపించి ఎన్నడూ వేళ తప్పకుండా ప్రార్ధించిన వ్యక్తిచే మసీదు నిర్మాణము ప్రారంభింపచేయాలని తలచాడు. కానీ ఎవరూ ముందుకు రాకపోయేసరికి 12వ యేట నుండి ఎన్నడూ వేళ తప్పకుండా రోజుకు ఐదు సార్లు ప్రార్ధించిన తనే స్వయంగా నిర్మాణము ప్రారంభించాడని చెప్పుకుంటారు.
 
మహమ్మద్ కుతుబ్ షా [[జనవరి 31]], [[1626]]న మరణించాడు. ఈయన సమాధి [[కుతుబ్‌షాహీ సమాధులు|కుతుబ్‌షాహీ సమాధుల]]లో ఒకటి. అది ఈయనకు ముందు సుల్తానుల సమాధుల కంటే ఉన్నతమైనది. ఈ సమాధి మందిరములో ఈయన సమాధితో పాటు ఈయన కుమార్తెలు, కుమారుల సమాధులు కూడా కలవు. ఈయన తర్వాత ఈయన కుమారుడు [[అబ్దుల్లా కుతుబ్ షా]] గోల్కొండ చక్రవర్తి అయ్యాడు.
 
==మూలములు==