ఊరగాయ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 34:
యైన యూరుగాయలు గల వతని యింట. <br>
 
ఈ పద్యం నుంచి 18వ శతాబ్దంలో తెలుగువాళ్ళు ఎన్నో రకాల ఊరగాయలని చేసుకొని తినేవారని తెలుస్తుంది. <ref>[https://archive.org/details/Hamsavimsati '''అయ్యలరాజు నారాయణామాత్యుడు''', ''హంసవింశతి'', 4.135, ''శృంగార కావ్య గ్రంథ మండలి ప్రబంధ పరంపర'' - 4 originally published in the later half of eighteenth century, మచిలీపట్టణం, 1938. ] </ref> ఈ పద్యం చదివినప్పుడల్లా ఏ తెలుగువారికైనా నోరు ఊరుతుంది. దీనికి ముందే 16వ శతాబ్దంలో [[శ్రీకృష్ణదేవరాయలు]] రచించిన [[ఆముక్తమాల్యద]] <ref>[https://archive.org/details/amuktamalyada00krissher '''శ్రీకృష్ణదేవరాయలు''', ''ఆముక్తమాల్యద'', 1, 79-82, originally written in 16th century, వావిళ్లరామశాస్త్రి & సన్స్ మూడవకూర్పు 1907 ముద్రణ] , పునర్ముద్రణ, తెలుగువిశ్వవిద్యాలయము, 1995.] </ref> గ్రంధంలో కూడా ఊరగాయలని గురించి ఉంది. ఆముక్తమాల్యద శ్రీకృష్ణుడి భక్తురాలైన గోదాదేవి కథ, చాలా విచిత్రమైనది. టూకీగా ఆ కథ చెప్తాను. తన జీవితాన్ని శ్రీకృష్ణుడికే అంకితం చెయ్యదలచుకొని ఈవిడ పెళ్ళి చేసుకోలేదు. ఈవిడనే మొదటి ఆండాళ్‌ అంటారు. ఈవిడ విష్ణుచిత్తుడి కూతురు. విష్ణుచిత్తుడు ప్రతిరోజూ ఒక కొత్త పూలదండ తయారుచేసి, శ్రీకృష్ణుడి విగ్రహానికి వెయ్యమని కూతురికి ఇచ్చేవాడు. గోదాదేవికి తన నాధుడైన శ్రీకృష్ణుడికి దండ మంచిదైతేనేగానీ వెయ్యడం ఇష్టంలేదు. అదిమంచిదో కాదో తెలుసుకోవడానికి దాన్ని ముందు తను ధరించి, మంచిదనిపించినతర్వాతే శ్రికృష్ణుడి విగ్రహానికి వేసేది. ఒకరోజు విష్ణుచిత్తుడు పూజ చేసే సమయంలో విగ్రహానికి వేసియున్న దండలో పొడుగాటి వెంట్రుకను చూస్తాడు. కూతురు దండను తను ముందు ధరించి తర్వాత దాన్ని విగ్రహాంమీద వేసిందని అతను అప్పుడు తెలుసుకుంటాడు. వాడిన పూలదండను దేవుడికి వెయ్యడం మహాపాపం అంటూ కూతుర్ని కోపగించి, ఆ వాడిన దండ తీసేసి, ఒకకొత్తదండ తయారుచేసి తనే వేస్తాడు. ఆ రాత్రి విష్ణుచిత్తుడికి కృష్ణుడు కలలో కనిపించి "నాకు ఇవ్వాళ నువ్వు వేసిన దండ ఏమీ బాగాలేదు. మళ్ళీ రేపటినుంచీ నాకు మీ అమ్మాయి ఇంతకుముందువేశే దండల్లాంటివే వెయ్యమను" అని హెచ్చరిస్తాడు.
 
ఆ కాలంలో విష్ణుచిత్తిడు తన అతిధుల భోజనానికి వివిధ ఋతువుల్లో ఏ ఏ వంటకాలు వడ్డన చేశేవాడో, ఈ వంటకాలు చెయ్యడానికి అతని భార్య ఎలాంటి వంటచెరుకు (కట్టెలు, కొబ్బరిచిప్పలు) వాడేదో, ఈ గ్రంధంలో 3 పద్యాల్లో వర్ణిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. ప్రతిపద్యం క్రిందా బ్రాకెట్టుల్లో దాని తాత్పర్యంకూడా ఇచ్చాను చదవండి.
పంక్తి 66:
(పునుగు వాసనగల అన్నము, మిరియాల పొడులు, ఘమఘమలాడు వేడి కూరలు, ఆవ, చిగురు పచ్చళ్ళు, పాయసము, ఊరుగాయలు, కరిగిన నేయి, పాలు- ఇవి శీతాకాలపు వంటకాలు.) ఇరపమొక్కలు భారతదేశానికి అమెరికాఖండం నుంచి వఛ్ఛాయి. కారం రుచికి మిరియాలను వాడినట్లు చెప్పాడు, ఈ గ్రధం వ్రాశిన కాలానికి మిరపమొక్కలు ఇంకా భారతదేశానికి రాలేదేమో.
 
ఆముక్తమాల్యదకు ముందే 14వ శతాబ్దంలో రచింపబడిన క్రీడాభిరామములో <ref>[http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=kreedabhiramamu&author1=venukonda_vallabharayakruti&subject1=NULL&year=1960%20&language1=telugu&pages=328&barcode=2020010005853&author2=NULL&identifier1=NULL&publisher1=manimanjari&contributor1=ccl&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&scannerno1=0&digitalrepublisher1=par%20informatics,%20hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=in_copyright&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=book%20&url=/data6/upload/0153/184 '''వినుకొండ వల్లభరాయడు''' ,''క్రీడాభిరామము'', Originally written in 14th century, పునర్ముద్రణ వేటూరి ప్రభాకరశాస్త్రి( సం)శ్రీ ప్రభాకర పరిశోధక మండలి, మణిమంజరి, హైద్రాబాదు, 1960 (డిఎల్ఐ డిజిటల్ ప్రతి )], ఎమెస్కో బుక్స్‌, 166, 1997.]కూడా ఊరగాయలను గురించి చెప్పబడిన ఒకపద్యం తాత్పర్యంతో ఇస్తున్నాను చదవండి.] </ref>
 
[[ఉత్పలమాల]]
పంక్తి 117:
 
==పచ్చళ్ళు, ఊరగాయలు==
సాధారణంగా మనం [[ఇడ్లీ]], [[దోశ]]ల్లాంటివి తినేటప్పుడు నంచుకోవడానికి "పచ్చళ్ళు" (కొబ్బరి పచ్చడి, దోసపచ్చడి, బీరతొక్కు పచ్చడి వగైరా) వాడతాం. ఈ పచ్చళ్ళు నిలువ ఉండవు, వాటిని సాధారణంగా చేసిన రోజునే వాడేస్తారు (ముఖ్యంగా రెఫ్రిజిరేటర్లు లేని పూర్వ కాలంలో). ఊరగాయలు అలా కాకుండా చాలారోజులు నిలువ ఉంటాయి. ఇదీ పచ్చళ్ళకూ, ఊరగాయలకూ ముఖ్య భేదం. కానీ ఈ మధ్య ఊరగాయలను కూడా పచ్చళ్ళని పిలవడం పరిపాటి అయిపోయింది.
 
"https://te.wikipedia.org/wiki/ఊరగాయ" నుండి వెలికితీశారు