కోట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 124:
== గ్రామదేవత ==
ఈ ఊరి గ్రామ దేవత కోటమ్మ .ఆమె పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. జమదగ్ని మహర్షి రేణుకా దేవి తలను ఖండించమని తన పుత్రుడు పరశురాముని ఆదేశించితే, ఇక్కడే ఆయన తల నరికాడు అని ప్రశస్తి. అయితే ఖండించిన తరువాత తల అతికించేటపుడు, తొందరలో పక్కనే ఉండే మాతమ్మ తల కోటమ్మకు (రేణుకా దేవికి), కోటమ్మ తల మాతమ్మకు అతికించాడు అంటారు. ఇప్పటికీ కోటమ్మ తిరనాళలో జమదగ్ని ఋషి, పరుశురాముడు, మాతమ్మ విగ్రహాలు ఊరేగిస్తూ ఉంటారు.
* గ్రామదేవత కోటమ్మ సాగనంపు ఉత్సవం, 2014, జూన్- 20, శుక్రవారం నాడు, ఘనంగా నిర్వహించినారు. కోటమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రట్యేక ఆభరణాలతో విశిష్ట అలంకరణలు చేసినారు. ఉత్సవంలో భక్తులు, దారిపొడవునా కర్పూరహారతులిచ్చుచూ, అమ్మవారి దర్సనం చేసుకున్నారు. కీలుగుర్రాల విన్యాసాలు అలరించినవి. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నవి. [1]
==ఇతర ఆలయాలు==
* ఇక్కడే గంగమ్మ గుడి, నాగ దేవత పుట్ట ఉంటుంది.
* పెళ్లి కూతుర్ని చేసినా, పిల్లలు పుట్టక పోయినా, పుట్టిన తరువాత అయినా ఇక్కడకు వచ్చి మొక్కుకోవడం, పొంగలితో మొక్కు తీర్చుకోవడం, ఇక్కడి వాళ్లకు అలవాటు.