శంకరంబాడి సుందరాచారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
సుందరరామాయణం వ్రాస్తున్నప్పుడు [[రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ]]కు ఒక సందేహం కలిగి ఇతడిని "అయ్యా! సుందరాచారీ! తాటకి భయంకరస్వరూపిణి. నీ తేటగీతులలో ఇముడుతుందా?" అని ప్రశ్నించాడు. ఆయన్ దానిని ఒక సవాలుగా తీసుకుని తన సుందరరామాయణంలో తాటకిని ఇలా ప్రవేశపెట్టాడు.
 
<poem>
::నల్లకొండల నుగ్గుగా నలగగొట్టి
::చిమ్మచీకటిలోగల చేవబిండి
::కాళసర్పాల విసమెల్ల గలిపినూరి
::కాచిపోసిన రూపుగా గానుపించె
 
::పచ్చి రక్కసి, నడగొండవలెను, వదన
::గహ్వరము విచ్చి మంటలుగ్రక్కి,నాల్క
::సాచి, కనులెఱ్ఱవార, చేయూచికొనుచు
::నురము ముందుకునెట్టి, శిరమునెత్తి
 
::కాలభైరవియై వల్లకాటికెల్ల
::దానె గాపరి యనమించి తలల మాల
::మెడను వ్రేలాడ, ద్రాచులు పడగలెత్తి
::భూషలయి మేన బుసకొట్టి, ఘోషలిడుచు
 
::హరులు,తరులును,గిరులును,దరువులొకట
::వెంట బడిమూగ,నడుగులు,పిడుగులగుచు
::నిడిన చోట్లెల్ల గోతులు వడుచునుండ
::నచటి కరుదెంచె వికటాట్టహాసముగను
</poem>
తేటతెనుగు తనము పుణికిపుచ్చుకుని ఎదుటపడిన సుందరాచారి తాటకిని చూసి [[రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ]] ముక్కున వేలు వేసుకున్నాడు.
 
==బిరుదులు==