ఈతముక్కల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 98:
==గ్రామంలోని దేవాలయాలు==
శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అక్టోబరు 18, 2013 నాడు అమృతపూర్ణిమ సందర్భంగా, 5వ వార్షికోత్సవం ఘనంగా జరిపినారు. వెన్నెల్లో పాయసం తయారుచేసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదం తీసుకుకున్నవారికి మానసిక ప్రశాంతత వస్తుందని ప్రతీతి. అమ్మవారు ఆరోజు అరటిపళ్ళ మధ్య కొలువుదీరినారు.అందువలన అమ్మవారిని "కదళీఫల కదంబ వనప్రియే" అని సంబోధించెదరు. [3]
 
ఈ గ్రామానికి చెందిన డా.ఎ.రవీంద్రబాబు, "ఈతముక్కల జ్వాలాముఖీదేవి" అను పుస్తకాన్ని రచించినారు. వీరు ముందుగా జంటగ్రామాల చరిత్ర తెలుసుకొని, అనేక గ్రంధాలు తరచిచూసి, అంతర్జాలంలో కొంత సమాచారాన్ని సేకరించి, ఈ పుస్తక రచనకు పూనుకున్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ, 2014,మే-29 న ఆలయ ప్రాంగణంలో జరిగినది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినారు. హిమాచలప్రదేశ్ లో ఉన్న జ్వాలాముఖి శక్తిపీఠానికి, అనుబంధ ఉపపీఠాలలో ఈతముక్కల ఆలయం గూడా ఉండటం విశేషం. [4]
 
"https://te.wikipedia.org/wiki/ఈతముక్కల" నుండి వెలికితీశారు