దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి fixing dead links
పంక్తి 15:
[[దస్త్రం:Madras Prov South 1909.jpg|thumb|200px|1909లో [[మద్రాసు ప్రెసిడెన్సీ]], [[మైసూరు రాజ్యము]] మరియు [[ట్రావెన్కూర్ రాజ్యము]]]]
 
[[కొత్తరాతియుగమున]]కు సంబంధించిన కొన్ని శిలలపై [[కార్బన్ డేటింగ్]] ద్వారా దక్షిణ భారతదేశపు ఉనికిని క్రీస్తుపూర్వం 8000కి చెందినదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. రాతి ఆయుధాలు, మరియు కొన్ని రాగి పాత్రలు ఈ ప్రాంతమునందు లభించాయి. క్రీస్తు పూర్వం 1000 నాటికి [[ఇనుప యుగం]] ఈ ప్రాంతంలో ప్రాబల్యం పొందినది. అయినా ఈ ఇనుప యుగానికి ముందు బాగా అభివృద్ధి చెందిన ఇత్తడి యుగం ప్రాచుర్యం పొందినట్లు ఆధారాలు లేవు <ref name="prehistory">Agarwal, D.P.[http://web.archive.org/web/20090318014356/http://www.arkeologi.uu.se/afr/projects/BOOK/agrawal.pdf "Urban Origins in India"], 2006. Archaeology and Ancient History, Uppsala Universitet</ref>. దక్షిణ భారతదేశం మధ్యధరా ప్రాంతాన్ని మరియు తూర్పు ప్రాంతాన్ని కలిపే కూడలి వంటిది. [[కార్వార్]] నుంచి [[కొడంగళూర్]] వరకు గల దక్షిణ తీర ప్రాంతం ప్రాంతీయులకు మరియు విదేశీ వ్యాపారస్థులకు ప్రధానమైన వాణిజ్య కూడలిగా ఉండేది<ref name="Pillai"> T.K Velu Pillai, 1940; Wilfred Schoff 1912 "Periplus Maris Erythraei" (trans) 1912, Menachery, G 1998; James Hough 1893; K.V. Krishna Iyer 1971</ref>. మలబార్ ప్రాంతం వారు మరియు [[సంగం]] ప్రాంతానికి చెందిన తమిళులు [[గ్రీకులు]], [[రోమన్లు]], [[అరబ్బులు]], [[సిరియన్లు]], [[చైనీయులు]], [[యూదులు]] మొదలైన వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. వీరికి ఫోయనీషియన్లతో కూడా సంపర్కముండేది<ref name="Blandstrom">(Bjorn Landstrom, 1964; Miller, J. Innes. 1969; Thomas Puthiakunnel 1973; & Koder S. 1973; Leslie Brown, 1956</ref>. దక్షిణ భారతదేశాన్ని పేరెన్నికగన్న అనేక మంది రాజులు మరియు వంశాలు పరిపాలించాయి. [[అమరావతి]]ని రాజధానిగా పాలించిన [[శాతవాహనులు]], బనవాసి [[కదంబులు]], [[పశ్చిమ గంగ]] వంశము, [[బాదామి]] [[చాళుక్యులు]], [[చేర వంశము]], [[చోళులు]], [[హోయసాలులు]], [[కాకతీయులు|కాకతీయ]] వంశపు రాజులు, [[పల్లవులు]], [[పాండ్యులు]], మణ్యకేతమునకు చెందిన [[రాష్ట్ర కూటులు]] మొదలైన చాలామంది రాజులు పరిపాలించారు. [[మధ్య యుగం]] నాటికి దక్షిణ భారతంలో [[ముస్లింలు|మహమ్మదీయుల]] పెత్తనం పెరిగింది. 1323లో [[ఢిల్లీ సుల్తాన్]] [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] సేనలు [[ఓరుగల్లు]]ను పరిపాలిస్తున్న కాకతీయులను ఓడించడంతో చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. [[గుల్బర్గా]]కు (తరువాతి కాలంలో [[బీదర్]]కు మార్పు) చెందిన [[బహమనీ సుల్తానులు|బహమనీ సామ్రాజ్యం]], మరియు [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యానికి]] (ఇప్పటి [[హంపి]]) చెందిన రాజులకు జరిగిన ఆధిపత్య పోరాటాలు చరిత్రలో చెప్పుకోదగ్గవి. విజయనగర రాజుల పతనం మరియు బహమనీ సుల్తానుల చీలిక వల్ల హైదరాబాదు, [[గోల్కొండ]]కు చెందిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహి వంశస్తులు]] ప్రధాన రాజులయ్యారు. [[ఔరంగజేబు]] నాయకత్వంలోని మొఘాలాయి సేనలు దక్షిణ ప్రాంతాన్ని ముట్టడించేవరకు (7వ శతాబ్దం మధ్యవరకూ) వీరి ఆధిపత్యం కొనసాగింది. అయితే ఔరంగజేబు మరణం తర్వాత మొఘలాయిల ఆధిపత్యం సన్నగిల్లింది. దక్షిణ భారతదేశపు రాజులు ఢీల్లీ నుంచి స్వయం ప్రతిపత్తిని సంపాదించుకున్నారు. [[మైసూరు]] సామ్రాజ్యానికి చెందిన [[ఒడయార్లు]], [[హైదరాబాదు]]కు చెందిన [[ఆసఫ్ జాహీ]]లు, [[మరాఠీ]]లు అధికారాన్ని పొందగలిగారు.
 
పద్దెనిమిదవ శతాబ్దం మధ్య భాగంలో అటు [[ఆంగ్లేయులు]], ఇటు [[ఫ్రెంచి వారు]] దక్షిణ భారతదేశము యొక్క సైనికాధికారానికి ధీర్గకాలిక పోరు సాగించారు. యూరోపియన్ సైన్యాలకు కొన్ని ప్రాంతీయ శక్తులకు ఏర్పడిన సంబంధాల వలన, అన్ని పక్షాలచే ఏర్పాటు చేయబడ్డ కిరాయి సైన్యాలు దక్షిణ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాయి. ఆంగ్లేయులతో నాలుగు సార్లు జరిగిన మైసూరు యుద్ధం, మూడు సార్లు జరిగిన మరాఠా యుద్ధం వలన [[మైసూరు]], [[పూణె]], [[హైదరాబాద్]] వంటి నగరాలు కొన్ని బ్రిటిష్ వారితోనూ, కొన్ని ఫ్రెంచి వారితోనూ సంబంధం కుదుర్చుకొన్నాయి. బ్రిటిష్ వారి పరిపాలనలో దక్షిణ భారతదేశాన్ని, [[మద్రాసు ప్రెసిడెన్సీ]], [[హైదరాబాదు]], [[మైసూరు]], [[తిరువిత్తంకూర్]] ('ట్రావెంకూర్' అని కూడా వ్యవహరిస్తారు), 'కొచి' ([[కొచ్చిన్]] లేదా ''పెరంపదపు స్వరూపం''), [[విజయనగరం (కర్ణాటక)|విజయనగరం]] మరియు ఇతర చిన్న చిన్న రాజ్యాలుగా విభజించారు. రాజుల కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆంగ్ల పరిపాలకులు కొన్ని ముఖ్యమైన రాష్ట్ర రాజధానులలో నివాసం ఉండేవారు.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు