ధర్మం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q134293
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''ధర్మము''' అనగా మానవత్వాన్ని రక్షించే గుణము. హిందూ దేశమునకు ధర్మక్షేత్రమని పేరు. సకల ప్రాణికోటిలో మానవ జన్మము ఉత్తమమైనది. ఇలాంటి మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో [[మానవజాతి]] ఒక్కటే సమర్ధమైనది. ఇతర ప్రాణులలో లేని [[బుద్ధి]] విశేషముగా ఉండటమే దీనికి కారణము. ఆహార భయ నిద్రా మైథునములు అన్ని ప్రాణుల యందు సమానమై, కేవలము యుక్తాయుక్త విచక్షణ, ఆలోచనకు రూపమీయగల ప్రజ్ఞ బుద్ధి ద్వారా సాధ్యమై ఈ ఉత్తమ గుణాన్ని సాధించవచ్చును.
 
"ధర్మం" , ఈ పదానికి , ఈ భావన కు భారతీయ మతాలలో (హైందవ , బౌద్ధ ,జైన , శిఖ్ఖు ) చాలా అర్ధాలుఉన్నాయి. సనాతన ధర్మం ప్రకారం " ఏ ప్రవర్తనా నియమావళి , మూల సూత్రాలు , మరియ ఏ న్యాయము చేత వ్యక్తి గత , సామాజిక , మతపర జీవితం సజావుగా నడపబడుతుందో , ఏ కారణము చే సర్వ జీవజాలం , ప్రకృతి లోని ప్రతి పదార్ధం
, శక్తి ఒక దానితోనొకటి అనుసంధానించబడి మనుగడ సాదిస్తాయో , ఏ కారణము చే ఈ ప్రపంచము , బ్రంహాండ మండలం తమ ఆస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో , అట్టి దానిని ధర్మము గా నిర్వచించారు.
 
బౌద్ధ ధర్మం ప్రకారం కనిపిస్తున్న మరియు కనిపించని వాటన్నిటినీ నడిపించే ప్రకృతి నియమావళిని , బుద్ధుని ప్రవచనాలను , మార్గదర్శకాలను , నాలుగు ఆర్యసత్యాలనూ , సాధన ద్వారా సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకుని నిర్వాణాన్ని పొందే మార్గాన్ని "ధర్మం" అని పిలుస్తారు.
 
జైన ధర్మం ప్రకారము జీన గురువులు ప్రవచించిన , బోధించిన పరిశుద్ధ జీవన మార్గాన్ని , కల్మశంలేని సాధన ద్వారా అనంత సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకునే మార్గాన్ని ధర్మం అని పిలిచారు.
 
శిఖ్ఖు మతం ప్రకారము గురువులు చూపిన న్యాయబద్ధమైన, సత్ప్రవర్తనను నేర్పిన , బాధ్యతాయుతమైన, లోక కళ్యాణ కారకమైన మార్గాన్ని , తద్వారా నిత్య సత్యాన్ని గ్రహించి పరమాత్ముని పొందే మార్గాన్ని ధర్మము అని పిలిచారు.
 
 
మానవులు తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టము కలిగించకుండా నెరవేర్చుకొనడమే ధర్మము యొక్క ముఖ్య లక్షణమని చెప్పవచ్చును. భూమి మీద సకల మానవులలోను కొందరు ఉత్తములుగా నుండి తోటి మానవులలో పూజింపబడితే దైవ సమానులుగా భావించబడడానికి వారు ఆచరిస్తున్న ధర్మ గుణమే ప్రధాన కారణము. [[శాంతి]], [[దయ]], [[అహింస]], [[సత్యము]], [[అస్తేయము]], [[ఉపకారము]], [[సానుభూతి]], [[శౌచము]] మొదలగు సుగుణము లన్నీ ధర్మమునకు అవయవాలై ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ధర్మం" నుండి వెలికితీశారు