ధర్మం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''ధర్మము''' అనగా మానవత్వాన్ని రక్షించే గుణము. హిందూ దేశమునకు ధర్మక్షేత్రమని పేరు. సకల ప్రాణికోటిలో మానవ జన్మము ఉత్తమమైనది. ఇలాంటి మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో [[మానవజాతి]] ఒక్కటే సమర్ధమైనది. ఇతర ప్రాణులలో లేని [[బుద్ధి]] విశేషముగా ఉండటమే దీనికి కారణము. ఆహార భయ నిద్రా మైథునములు అన్ని ప్రాణుల యందు సమానమై, కేవలము యుక్తాయుక్త విచక్షణ, ఆలోచనకు రూపమీయగల ప్రజ్ఞ బుద్ధి ద్వారా సాధ్యమై ఈ ఉత్తమ గుణాన్ని సాధించవచ్చును.
 
 
"ధర్మం" , ఈ పదానికి , ఈ భావన కు భారతీయ మతాలలో (హైందవ , బౌద్ధ ,జైన , శిఖ్ఖు ) చాలా అర్ధాలుఉన్నాయి. సనాతన ధర్మం ప్రకారం " ఏ ప్రవర్తనా నియమావళి , మూల సూత్రాలు , మరియ ఏ న్యాయము చేత వ్యక్తి గత , సామాజిక , మతపర జీవితం సజావుగా నడపబడుతుందో , ఏ కారణము చే సర్వ జీవజాలం , ప్రకృతి లోని ప్రతి పదార్ధం
, శక్తి ఒక దానితోనొకటి అనుసంధానించబడి మనుగడ సాదిస్తాయో , ఏ కారణము చే ఈ ప్రపంచము , బ్రంహాండ మండలం తమ ఆస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో , అట్టి దానిని ధర్మము గా నిర్వచించారు.
 
 
బౌద్ధ ధర్మం ప్రకారం కనిపిస్తున్న మరియు కనిపించని వాటన్నిటినీ నడిపించే ప్రకృతి నియమావళిని , బుద్ధుని ప్రవచనాలను , మార్గదర్శకాలను , నాలుగు ఆర్యసత్యాలనూ , సాధన ద్వారా సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకుని నిర్వాణాన్ని పొందే మార్గాన్ని "ధర్మం" అని పిలుస్తారు.
 
 
జైన ధర్మం ప్రకారము జీన గురువులు ప్రవచించిన , బోధించిన పరిశుద్ధ జీవన మార్గాన్ని , కల్మశంలేని సాధన ద్వారా అనంత సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకునే మార్గాన్ని ధర్మం అని పిలిచారు.
 
 
శిఖ్ఖు మతం ప్రకారము గురువులు చూపిన న్యాయబద్ధమైన, సత్ప్రవర్తనను నేర్పిన , బాధ్యతాయుతమైన, లోక కళ్యాణ కారకమైన మార్గాన్ని , తద్వారా నిత్య సత్యాన్ని గ్రహించి పరమాత్ముని పొందే మార్గాన్ని ధర్మము అని పిలిచారు.
 
 
 
"https://te.wikipedia.org/wiki/ధర్మం" నుండి వెలికితీశారు