పులస చేప: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
'''పులస చేప''' ([[ఆంగ్లం]]: Hilsailish) వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ [[చేప]] చాలా రుచికరంగా ఉంటుంది. 'పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి' అంటారు. ఇది [[గోదావరి నది]]లో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని 'వలస చేప' అంటారు. [[హుగ్లీ నది]]లో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు 'హిల్సా' అని పిలుస్తారు.
 
పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి జనం రాజధాని లో ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవటానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసును పట్టుకుని వెళ్ళేవారట.
పంక్తి 32:
పులస పులుసు చూశాక మీకు నోరూరుతోందా. అయితే దాన్ని రుచి చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే.
 
== పులసల పుట్టుక ==
పులస పుట్టుకే విచిత్రంగా ఉంటుంది. గోదావరికి వరదనీరు వచ్చిననాటినుండి (జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌) ఈ చేపలు దొరుకుతాయి. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్‌ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. సముద్రంలో ఉన్నపుడు విలసగా ఉండే ఈ చేపలు గోదావరిలోకి వలస వచ్చి పులసలుగా మారతాయి. సముద్రపు ఉప్పునీటిలో ఉన్నంతకాలం ఇవి విలసలుగా ఉండి సాధారణరుచి కలిగి ఉంటాయి. సముద్రంనుండి గోదావరి వరదనీటిలోకి ఎదురీదడంవల్ల ఈ చేపలకు అమోఘమైన రుచివస్తుంది. పులసచేపకు శాస్త్రీయనామం ఇవిష. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. సముద్రానికి దగ్గరగా ఉండే యానాం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులసలకు తక్కువధర ఉంటుంది. ఎందుకంటే అవి అప్పుడే గోదావరినీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి వాటికి అంతధర ఉండదు. అలాగే కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేపలకు ధర కొంచెంఎక్కువగా ఉంటుంది. కానీ పొట్టిలంక, ధవళేశ్వరం సమీపంలో దొరికే చేప ధరలకు అంతూపొంతూ ఉండదు. వీటి రుచి అధికంగా ఉండడంవల్ల ఈ చేపలకు డిమాండ్‌ పెరిగి సమయాన్ని బట్టి ధరలు పలుకుతుంటాయి.
 
== పులసల వేట ==
 
పులసను వేటాడడం ఆషామాషీకాదు. గేలం వేస్తేనో, వల విసిరితేనో ఇవి దొరికేయవు. ఏటిమధ్యకు వెళ్ళి వలలను మత్య్సకారులు ఏర్పాటు చేసుకుంటారు. తెల్లవారుజామున వేటకు వెళితే సాయంత్రానికి ఒకటిరెండు దొరికితే గొప్పే. కొన్ని సందర్భాల్లో అసలు దొరకనే దొరకవు. దొరికితే వారి పంట పండినట్లే. వలలో పడిన వెంటనే ఈ చేపలు మరణిస్తాయి. అందుకే ఇవి బతికుండగా జాలర్లు కూడా చూసిన దాఖలాలు ఉండవు. ఈ పులసచేపల్లో ఆడ(శన), మగ (గొడ్డు) అని రెండురకాలుంటాయి. ఇందులో ఆడచేప రుచి ఎక్కువగా ఉండడంవల్ల ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ప్రతీఏటా ఈ పులసకూరను కావాల్సినవారికి నజరానాగా పంపిస్తుంటారు. కానీ ఈ ఏడాది అవి దొరకకపోవడంవల్ల ఇతరప్రాంతాలకు పంపించే పరిస్థితి కనిపించడంలేదు.
 
==పేరు వెనుక కథ ==
డెల్టాలో లభించే చేపల రుచే అద్భుతం. అందుకే వేరే ప్రాంతాల్లో సెటిలైన డెల్టావాసులు కూడా ఇక్కడి చేపలే తినాలని అనుకుంటారు. నరసాపురం దగ్గర గోదావరి సాగరంలో కలుస్తుంది. అందుకే ఆ రెండూ కలిసే ప్రాంతంలో లభించే చేపలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. సముద్రంలో ఉండే ఇలస.. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. పుస్తెలమ్మయినా పులస తినాలన్న సామెత పుట్టిందంటే దాని రుచి అంత బాగుంటుంది మరి. సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట, ఉప్పుటేరులో కొల్లేరు సరస్సు కలిసేచోట లభించే చేపలకూ ఎంత ప్రత్యేకత ఉందో అంత గిరాకీ ఉంటుంది.
 
[[వర్గం:చేపలు]]
 
[[en:Hilsailish]]
"https://te.wikipedia.org/wiki/పులస_చేప" నుండి వెలికితీశారు