వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

కశ్యప్ గారి సూచన
కొన్ని వివరణలు
పంక్తి 37:
 
[[వాడుకరి:Kasyap|కశ్యప్]] గారూ మీ అభిమానానికి ఉత్సుకతకు ధన్యవాదాలు. అలాగే [https://meta.wikimedia.org/wiki/Grants:IEG/Islam_in_Andhra_Pradesh|ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం ప్రాజెక్టు పేజీ] లో ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టడం జరిగినది. ఇపుడు మార్పు చేయవచ్చునో లేదో తెలియదు. గమనించగలరు. కొంచెం చూసి చెప్పగలరు. మార్పులు సంభవం అని తెలిస్తే, మీరే చొరవ తీసుకుని మార్పులు చేసేది. మరీ ముఖ్యమైన విషయం "బడ్జెట్" శీర్షికలో వాలంటీర్స్ గివ్ అప్ కాలమ్ కొంచెం గమనించగలరు. వాటిని ప్రస్తుతం మార్పులు చేర్పులు చేయవచ్చో లేదో తెలియదు. ఈవిషయాన్ని మన్నించి గమనించగలరు. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 08:53, 29 సెప్టెంబరు 2014 (UTC)
 
==కొన్ని వివరణలు==
పైన [[వాడుకరి:వైజాసత్య]] గారు మరియు [[వాడుకరి:Naidugari Jayanna|నాయుడుగారి జయన్న]] గారు వెలుబుచ్చిన సందేహాలు సమంజసమైనవి. వాటికి వివరణ ఇలా ఇవ్వదలచాను,
* "ఆంధ్ర" అనే పేరు వైదికకాలం నుండి ఉపయోగంలో వున్నది. ఆంధ్రదేశం లోని వివిధ ప్రాంతాలు వివిధ రాజ్యాల క్రింద వివిధ కాలములలో ఉండేవి. పూర్వమధ్యయుగపు ఆంధ్ర చరిత్రలో తూర్పు చాళుక్యుల కాలం 624-1076. ఆ తరువాత కాకతీయులు. ఆతరువాత ఉత్తర మధ్యయుగపు చరిత్ర (1320-1565), అందులో ముసునూరి నాయకుల కాలం, ఆతరువాత బహమనీ రాజ్యం, ఆతరువాత విజయనగరసామ్రాజం. ఆతరువాత ఆధునిక యుగము
1540 – 1956. ఆతరువాత నేటి కాలం. ఈ కాలాలలో ముస్లిముల చరిత్రను ఆంగ్లవికీలో వెతికితే స్థూలంగా దొరుకుతుంది కాని సూక్ష్మంగా దొరకదు. నేను తెవికీలో [[భారతదేశంలో ఇస్లాం]] వ్యాసము మరియు డానికి సంబంధించిన ఇతర వ్యాసాలు వ్రాసేటపుడు, ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర దేశం)లో ఇస్లాం అనే సబ్జెక్ట్ పై వ్రాయడానికి రెఫరెన్సులు వెతకడానికి ప్రయత్నించాను, అయినా అరకొరగా దొరికాయి. వాటిలో బహమనీ రాజ్యం, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, మైసూరు రాజ్యం, మొదలగు వాటికి లభించాయి. ఆధునిక యుగంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఇస్లాం అంటే కేవలం బహమనీ రాజ్యం, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలపు కొన్ని విషయాలకు మాత్రమే మూలాలు దొరికాయి. హైదరాబాదు మరియు చుట్టూ ప్రక్కల ప్రాంతాల ముస్లింల చరిత్రే "ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల చరిత్ర" అని ఆలోచించే ప్రమాదం ఏర్పడింది.
 
* ఇక్కడ మేము చేస్తున్న ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అంటే కేవలం హైదరాబాదు మరియు కొన్ని (మాత్రమే) ఇతర చిన్న ప్రాంతాల చరిత్ర మాత్రమే కాదు, ఇంకా మిగతా ప్రాంతాలు (ప్రధానంగా నేటి ఆంధ్రప్రదేశ్) ప్రాంతాలు కూడా ప్రాముఖ్యతను కలివున్నవేనని చూపడం ప్రధాన వస్తువు.
 
* వైజాసత్యగారు సరిగా నాడిపట్టారు. ఈ ప్రాజెక్టు ఆంధ్ర దేశంలో ఇస్లాం సరైన పేరని. దీనికి నావివరణ, ఆంధ్ర దేశంలో ఇస్లాం -> ఆంధ్రప్రదేశ్ (నేటి) లో ఇస్లాం + తెలంగాణలో ఇస్లాం, అవుతుంది. తెలంగాణలో ఇస్లాం అనే ప్రాజెక్టును + ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం ను పూర్తి చేయగలిగితే = ఆంధ్ర దేశంలో ఇస్లాం అనే ఓ పరిపూర్ణ చారిత్రిక రూపం వస్తుంది. దీనిపై సభ్యులు తమ అమూల్యమైన, స్పష్టమైన సలహాలను అందించగలరని ఆశిస్తున్నాను. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 09:22, 29 సెప్టెంబరు 2014 (UTC)
 
==ప్రాజెక్టు వలన లాభాలు==
* ఈ ప్రాజెక్టు కొరకు ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాలలో ప్రయాణించి విషయసేకరణ చేయవలెను కాబట్టి,
* తెవికీకి ఓ మంచి ప్రచార సాధనం కావచ్చు.
* అలాగే, ఈ ప్రయాణం, తెవికీకి అనేక ఫోటోల సేకరణకు ఉపయుక్తంగా వుంటుంది.
* అనేక సంస్థలతో అనుసంధానాలు, తెవికీ విధివిధానాల ప్రచారం, జరుగవచ్చు
* కొత్త సభ్యుల చేర్పులు జరిగే అవకాశాలు
* కొత్త వ్యాసాలు వ్రాయడానికి కావలసిన వనరులు సేకరించవచ్చు.
[[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 09:22, 29 సెప్టెంబరు 2014 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం".