వాసవదత్తా పరిణయము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
'''వాసవదత్తా పరిణయము''' అనే ఈ కావ్యాన్ని [[వక్కలంక వీరభద్రకవి]] క్రీ.శ. 1704లో వ్రాశాడు. ఐదు ఆశ్వాసాలున్న ఈ ప్రౌఢకావ్యానికి మూలము సంస్కృత భాషలోని వాసవదత్తా అనే గద్యకావ్యము. దానిని సుబంధుడు అనే కవి వ్రాశాడు. సంస్కృతకావ్యానికి ఇది స్వేచ్ఛానువాదము. వీరభద్రకవి మూలకథను కొంత అనుసరించి, కొంత అతిక్రమించి, కొంత కుంచించి, కొంత సృష్టించి వాసవదత్తా పరిణయమును రసవంతమైన కావ్యముగా తీర్చిదిద్దాడు. వైదర్భీరీతిలో రచింపబడిన ఈ కావ్యాన్ని కవి తన సంస్థానాధీశుడైన రావు పెదమాధవరావుకు అంకితమిచ్చాడు. ఈ కావ్యం 1897లో వీరభద్రకవి వంశీకుడైన వక్కలంక భీమశంకరం రాజమండ్రిలోని వివేకవర్ధినీ ముద్రణాలయములో ముద్రించి ప్రకటించాడు.
 
==ఇతివృత్తము==
::చింతామణి అనే రాజు యొక్క కుమారుడూ కందర్పకేతుడు పాటలీపుత్రానికి అధిపతి. అతడు కలలో సాక్షాత్కరించిన ఒక సుందరిని వలచి, విరహతప్తుడై రాచకార్యాలను విడిచి, సఖుడైన మకరందునితో కలసి వింధ్యాటవికి వెళతాడు. అక్కడ రేవానది దగ్గర ఒక శమీవృక్షము వద్ద విశ్రమించి ఉండగా వారికి శుకశారికల సంభాషణ వినిపిస్తుంది. అక్కడ ఒక చిలుక రెండు గోరింకలు ఉన్నాయి. చిలుక తాను చూచివచ్చిన వింతలను ఒక గోరింకకు తెలుపుతూ, కుసుమపురగాధను ఈ క్రింది విధంగా వివరిస్తుంది.
 
::కుసుమపురానికి శృంగార శేఖరుడు అనేవాడు రాజు. అతని భార్య రాజ్యలక్ష్మి. ఇంద్రుని వరప్రసాదముతో వారికి ఒక కుమార్తె కలుగగా శృంగార శేఖరుడు ఆమెకు వాసవదత్త అని నామకరణం చేస్తాడు. యౌవనవతి అయిన వాసవదత్తకు రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు కానీ ఆమె ఎవ్వరినీ వరించలేదు. వాసవదత్తకు కలలో పాటలీపుత్రాధిపతి అయిన కందర్పకేతుడు కనిపించగా, ఆమె అతనియందే వలపు నిలిపి విరహ తాపాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఆ సమయంలో 'తమాలిక' అనే శారిక వాసవదత్తను ఊరడించి, తాను కందర్పకేతుని దగ్గరకు వెడతానని పలుకుతుంది. వాసవదత్త మహదానందంతో ఒక ప్రేమలేఖ వ్రాసి 'తమాలిక'కు ఇస్తుంది. ఆ తమాలికయే తనతో వచ్చిన గోరింక అని చిలుక మొదటి గోరింకకు తెలుపుతుంది.
"https://te.wikipedia.org/wiki/వాసవదత్తా_పరిణయము" నుండి వెలికితీశారు