ఆగడు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మలు జతచేసాను
కథను జతచేసాను
పంక్తి 22:
 
ఈ సినిమా హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ భవనంలో అక్టోబర్ 25, 2013న అధికారికంగా ప్రారంభించబడింది.<ref name="launch">{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/aagadu-movie-launch-124483.html|title=మహేష్ కొత్త మూవీ ‘ఆగడు’ ప్రారంభం(ఫోటోలు)|publisher=వన్ఇండియా|date=October 25, 2013|accessdate=March 20, 2014}}</ref> ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాదులో నవంబర్ 28, 2013న మొదలయ్యింది.<ref name="shoot begin">{{cite web|url=http://www.123telugu.com/telugu/news/maheshs-aagadu-to-start-today.html|title=నేటి నుంచి మొదలుకానున్న మహేష్ ‘ఆగడు’|publisher=123తెలుగు.కామ్|date=November 28, 2013|accessdate=March 20, 2014}}</ref> ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ 5, 2014న ఊటీలో ముగిసింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/aagadu-celebrates-its-gummadikaya-function-today.html|title=నేటితో ‘ఆగడు’కి గుమ్మడికాయ.!|publisher=123తెలుగు.కామ్|date=September 5, 2014|accessdate=September 8, 2014}}</ref> ఈ సినిమా భారీ అంచనాల నడుమన దాదాపు 2000 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 19, 2014న విడుదల అయ్యింది.<ref>{{cite web|url=http://www.cinevinodam.com/newsinner/1/209/mahesh-babu-aagadu-on-19-th-september.html|title=సెప్టెంబర్ 19న మహేష్ బాబు' ఆగడు'|publisher=సినీవినోదం|date=September 1, 2014|accessdate=September 4, 2014}}</ref><ref>{{cite web|url=http://www.suryaa.com/lifestyle/article-0-191882|title=వాట్‌ టు డు వాట్‌ నాట్‌ టు డు|publisher=సూర్య దినపత్రిక|date=September 2, 2014|accessdate=September 4, 2014}}</ref><ref>{{cite web|url=http://www.andhrabhoomi.net/node/167689|title=19న మహేష్‌బాబు ‘ఆగడు’|publisher=ఆంధ్రభూమి|date=September 17, 2014|accessdate=September 20, 2014}}</ref>
 
==కథ==
చైన్ స్నాచింగ్ ముఠాని తన తెలివితేటలతో పోలీసులకు పట్టించిన శంకర్ అనే అనాధని రాజారావు అనే పోలీస్ అధికారి దత్తత తీసుకుంటాడు. తను, తన కొడుకు భరత్ శంకర్ ని తమ సొంతవాడిగానే చూసుకుంటారు. ఒకసారి భరత్ ఒక కుర్రాడి చావుకు కారణమవుతాడు. ఆ నింద తనమీద వేసుకుని జైలుపాలై రాజారావుకి శాశ్వతంగా దూరమవుతాడు శంకర్. జైల్లోని బాస్టన్ స్కూల్లో చదివి సర్కిల్ ఇన్స్పెక్టరుగా మారుతాడు. ఎంకౌంటర్ శంకర్ అని పోలీస్ శాఖచేత పిలువబడుతూ తను పనిచేసే చోట ఎక్కడా నేరస్తులకు నిద్రలేకుండా చేస్తుంటాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో బుక్కపట్నంలో దామోదర్, అతని అనుచరుల అరాచకాలు ఎక్కువవుతున్నాయని తెలుసుకున్న కమిషనర్ మానవ హక్కుల సంఘం కార్యదర్శి ప్రకాష్, జిల్లా కలెక్టర్ మరియూ అతని భార్య హత్యల నేపధ్యంలో శంకర్ని అక్కడికి బదిలీ చేస్తాడు. ఈ హత్యలకు కారణం దామోదర్ కట్టాలనుకుంటున్న పవర్ ప్రాజెక్ట్ పర్యావరణానికి, జనాల ప్రాణాలకి అత్యంత హానికరం అని ప్రకాష్ నివేదిక ఇవ్వడమే. దామోదర్, అతని తమ్ముడు దుర్గ దుబాయిలో హాలిడేలో ఉండగా అక్కడికి టూరిస్ట్ గైడుగా ఒక పోలీస్ అధికారిని పంపి ఈ ప్రాజెక్టుకు ఎవరు సహకరిస్తున్నారనే సాక్ష్యాలు సంపాదిస్తాడు.
 
ఇక్కడ అనంతపురంలో దామోదర్ నడుపుతున్న అక్రమ మద్యం, బెట్టింగ్, కల్తీ వ్యాపారాలను మూయించేస్తాడు. ఇదంతా జరుగుతుండగా శంకర్ సరోజ అనే స్వీట్ షాప్ ఓనరుని ప్రేమిస్తాడు. డబ్బిస్తే ఒక వ్యక్తి గురించి ఎలాంటి సమాచారమైన ఇవ్వగలిగే డేటాబేస్ దానయ్య సహాయంతో సరోజ గురించి తెలుసుకుని కొంత కాలం తర్వాత ఆమె మనసును గెలుచుకుంటాడు. దామోదర్ దుబాయి నుంచి తిరిగి రాగానే తన కళ్ళ ముందే తన వాళ్ళని కొట్టి న్యాయస్థానం ఆదేశాలతో ప్రాజెక్టుపై స్టే తీసుకొస్తాడు. శంకర్ ఇచ్చిన ధైర్యంతో ఎస్పీ మల్లిఖార్జున్ దగ్గరికి వెళ్ళి శేఖర్ అనే సాక్షి ప్రకాష్ హత్య గురించి వివరాలిస్తాడు. మరుసటిరోజు దామోదర్ బెదిరించడం వల్ల శేఖర్ చివరి నిమిషంలో మాట మారుస్తాడు. మల్లిఖార్జున్ వివరణ ఇవ్వకుంటే నిన్ను సస్పెండ్ చేయ్యాల్సివస్తుందని శంకర్‌తో చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుర్రాడి హత్య వెనకున్న నిజం తెలుసుకున్న రాజారావు ద్వారా చనిపోయిన కలెక్టర్ రాజారావు కొడుకు భరత్ అని, ప్రాజెక్ట్ ఆపేందుకు ప్రయత్నించడంతో దామోదర్, అతనితో కుమ్మక్కైన మల్లిఖార్జున్, కేంద్రమంత్రి నాగరాజు భరత్, అతని భార్యపై నిందలెయ్యడంతో ఒక రాత్రి శంకర్ గురించి నిజం చెప్పి విషం తాగి భరత్, అతని భార్య చనిపోతారు.
 
పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్న శంకర్ దామోదర్ దగ్గరికెళ్ళి నేను మీ మనిషిగా పనిచేస్తానని నమ్మిస్తాడు. ఆ ప్రాజెక్టుకి ఫైనాన్స్ చేసే ఢిల్లీ సూరి గురించి దానయ్య ద్వారా తెలుసుకుని అతన్ని ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అడిగేలా పరోక్షంగా ఉసిగొలిపి అతని ద్వారా నాగరాజు చావుకి కారణమవుతాడు. దామోదర్ ప్రేయసి సుకన్య ఒకప్పుడు బి-గ్రేడ్ సినిమాల్లో పనిచేసిందని, ఆమెపై కన్నేసిన మల్లిఖార్జున్ నపున్సకుడని దానయ్య ద్వారా తెలుసుకున్న శంకర్ సూరి సహాయంతో మల్లిఖార్జున్ సుకన్యపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని దామోదర్ ని నమ్మించి సూరి ద్వారా విషం కలిపిన ఆహారాన్ని మల్లిఖార్జున్ చేత తినిపించి చంపుతాడు. ఈలోపు శంకర్, సరోజల నిశ్చితార్థం జరిగిపోతుంది. సరైన సమయం చూసి భరత్ బావమరిది సహాయంతో దుర్గ దామోదర్ ని ఆస్తి కోసం చంపాలని చూస్తున్నాడని దామోదర్ ని నమ్మించి దుర్గని చంపేలా చేస్తాడు. ఇలా తను శంకర్ చేతిలో ఇరుక్కోడానికి కారణమైన దానయ్య ఆఫీసును ధ్వంసం చేసిన సూరిపై పగ పెంచుకున్న దానయ్య దామోదర్‌కి ఫోన్ చేసి సూరి మిమ్మల్ని మోసం చేసాడని చెప్తాడు. సూరిని చంపబోతుండగా శంకర్ అక్కడికొచ్చి తను చేసిన మాయని వివరిస్తాడు. శంకర్, దామోదర్ మధ్య జరిగిన పోరాటంలో బుక్కపట్నం జనం చూస్తుండగా శంకర్ దామోదర్ని చంపేస్తాడు. భరత్ సేవలకి ప్రభుత్వం పురస్కారం అందజేయగా సూరిని పోలీస్ శాఖ శంకర్ కింద నిఘా వ్యవస్థలో అధికారిగా నియమిస్తారు.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ఆగడు" నుండి వెలికితీశారు