దగ్గు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
*తేనె చాలా ఉపయోగకరం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ పరిశోధకులు గుర్తించారు. రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు చెంచాల తేనె తాగిస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం కలుగుతుందని వీరి తాజా అధ్యయనాల్లో తేలింది. ఇది సమర్థమైన ప్రత్యామ్నాయ పద్ధతి అని పరిశోధకులు అంటున్నారు. విటమిన్ సి, ఫ్లావనాయిడ్ల నుండి ఉత్పత్తయిన యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో దండిగా ఉంటాయని వారు గుర్తు చేస్తున్నారు. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉండటంవల్ల తేనెలోని తియ్యదనం దగ్గును తగ్గించేందుకు తోడ్పడుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
*సొంటి కషాయంలోగాని లేక అల్లం రసంలోగాని తేనె తీసుకుంటే దగ్గు, ఆయాసం, జలుబు, కఫం తగ్గుతాయి.
*అడ్డ సరపాకుల రసంలో తేనె కలిపి రోజుకు 5 నుండి 10 మి.లీ. వరకు 3 లేక నాలుగు సార్లు తీసుకున్నా దగ్గు, ఆయాసం తగ్గుతుంది.
*ఉసరికపండ్లను పాలతో ఉడకబెట్టి ఎండించి పొడి చేసి దానిని 1/4గ్రా. నుండి 1/2గ్రా. మోతాదులో పుచ్చుకుంటే ఎలాంటి దగ్గయినా తగ్గును. ట పిప్పళ్ళను నీళ్ళతో మెత్తగా నూరి నువ్వులనూనెలో వేయించి తీసి, పటిక కలిపి కషాయంతో కలిపి తీసుకుంటే కఫముతో కలిపి వస్తున్న దగ్గు తగ్గుతుంది.
*తాని కాయలపొడిని తేనెతోగాని, తమల పాకుల రసంతోగాని, తులసి రసంతోగాని 1/4 నుంచి 1/2 గ్రాము మోతాదులో పుచ్చుకుంటే కఫముతో కూడిన దగ్గు తగ్గుతుంది. పటికిబెల్లం పొడిలో కలిపి తీసుకుంటే పొడిదగ్గు తగ్గుతుంది
"https://te.wikipedia.org/wiki/దగ్గు" నుండి వెలికితీశారు