విజయలక్ష్మి పండిట్: కూర్పుల మధ్య తేడాలు

Reverted to revision 1215525 by RahmanuddinBot: why remove?. (TW)
పంక్తి 77:
==వివాహం==
కథియవార్ లో రంజిత పండిట్ అనే ఒక న్యాయవాది ఉండేవాడు. ఆయన ఉత్తమైన వ్యక్తి. విద్యాధికుడూ. [[మహదేవ దేశాయ్]], [[రంజిత పండిట్]] లు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. మహదేవ దేశాయ్ గాంధీజీకి అంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. రంజిత పండిట్ కూ , స్వరూప కూమారీలకు [[1921]] సంవత్సరం [[మే 10]] వ తారీఖున వివాహం జరిగింది. వీరి వివాహానికి గాంధీజీ తో సహా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అందరూ హాజరయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేసం యేర్పాటు చేయబడింది. ఓప్రక్క విజయలక్ష్మీ పండిట్ వివాహం, మరోప్రక్క వర్కింగ్ కమిటీ సమావేశంతో [[అలహాబాద్]] కళ కళ లాడింది. వీరిద్ధరూ ఆదర్శ దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. పండిట్ విద్యాధికుడూ, జ్ఞాని అని గ్రహించిన విజయలక్ష్మి అతని శిష్యురాలిగానే నదుచుకుంది. విజయలక్ష్మీ ని కేవలం రూపసికాకల్, సంసార లక్షణాలుగల యువతిగా అభిమానించిన రంజిత్ పండిట్ అభిప్రాయం చివరివరకూ అదే మాదిరిగా ఉండేది. వీరి జీవితం ఆదర్శం. వీరి ఆశయాలు మహోన్నతమైనవి. చంద్రలేఖ, నయనతార, రీటా ఈ ముగ్గురూ ఈ దంపతులకు కలిగిన కుమార్తెలు.
 
==భర్తతో కలిసి యూరప్ పర్యటన==
సబర్మతీ ఆశ్రమం లో ఉన్నపుడైనా, మోతీలాల్ గాంధీజీ అభిప్రాయాలతో ఏకీభవించలేక పొయ్యాడు. విజయలక్ష్మీ పండిట్, రంజిత్ పండిట్ లు యూరప్ అంతా తిరగాలనిపించి 1925 లో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకొనే సమయానికి అన్న గారి భార్త కమలకు ఆరోగ్యం పాడై స్విట్జర్ లాండ్ తీసుకు వెళ్ళవలసి వచ్చి, జవహర్‍లాల్ భార్య, కుమార్తె లతో కలసి యూరప్ కు బయలుదేరాడు. విజయలక్ష్మి,రంజిత్ లు కూడా వారితో కలసి వెళ్ళారు. ఈ దంపతులిద్దరూ కొంతకాలం యాత్ర చేసి, వివిధ దేశాల ఆర్థిక రాజకీయ, సాంఘిక పరిస్థితులను స్వయంగా చూసి తిరిగి ఇండియా చేరుకున్నారు. 1927 వ సంవత్సరం మోతీలాలు కూడా యూరప్ వెళ్ళాడు. ఆయన అక్కడ ఉండగానే విజయలక్ష్మి రంజిత్ లు తిరిగి యూరప్ బయలుదేరి వెళ్ళారు.
 
==గాంధీజీ ఉప్పుసత్యాగ్రహంలో విజయలక్ష్మి==
Line 99 ⟶ 102:
 
తననియోజక వర్గం లో విపరీతంగా ఉన్న మలేరియా ను అరికట్టేందుకు ఆమె ఎంతగానో, పాటుపడింది. విద్యార్థులు వ్యాయామ నిమిత్తం అనేక పట్టణ, పల్లెలలో ఆట స్థలాలెన్నో ఏర్పాటు చేసింది. ఎవరెన్ని చేయించినా, పేరుకు మాత్రం భారత ప్రభుత్వం కానీ, అధికారాలన్నీ గవర్నర్ల చేతుల్లో ఉండేవి. వారు వీరి ఆలోచనలూ, ఆశయాలూ సాగనివ్వకుండా నిరంకుశ విధానము లోనే నడిచేవారు.
 
==రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో==
1939 సెప్టెంబర్ లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభించబడింది. బ్రిటిషు ప్రభుత్వం ఈ యుద్ధంలో ఇండియాను ఇరికించింది. భారతీయుల సైనుకులు యుద్ధానికి రావాలంది. ప్రజానాయకులెవ్వరూ అందుకు అంగీకరించలేదు. బ్రిటిషు పాలకుల గోడమీది పిల్లి వాటం అటు నాయకులకూ అర్థం అయిపోయింది. నాయకులంతా రాజీనామా లిచ్చి బయటకు వచ్చేశారు.
 
భారతీయ నాయకులతో ఏ విధమైన సంప్రదింపులు లేకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులను భాగస్వామ్యులుగా చేసినందుకు విజయలక్ష్మీ పండిట్ ఆడ పులిలా గర్జించింది. భారతీయుల క్షేమం కోసం అంటూ, తన తప్పులతో భారతీయులకు పాలు పంచటం కుటిల రాజనీతి అంది. భారతీయులను బానిసలుగా చేసి వారి చేతిలో కీలుబొమ్మల మాదిరి ఆడించే బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని సహించమని హెచ్చరిక చేసింది. కేవలం యుద్ధ సమయాలలో మాత్రమే భారఈయులకు స్వాతంత్రము అనే ఎర వేస్తూ యుద్ధము ముగిశాక భారతీయుల పట్ల బ్రిటిష్ వారు చూపించే నిరాదరనను క్షమించరు భారతీయులంది. ఈ యుక్తుల ద్వారా బ్రితిషు ప్రభుత్వం సాధించి పెట్టేదేమిటో, నిక్కచ్చిగా తేల్చమంది.
 
లేవండీ ఈ దేశము మనది. పరిపాలించే వారు పరాయివారు. వారి అధికారాన్ని సహించకండి. జాతి మేలుకోవాలి. స్వరాజ్యం స్థాపించే వరకూ నిదురించకూడదు! ప్రజలను నిద్ర మోల్కొలపింది.
 
పక్షవాతం వచ్చి తల్లి స్వరూపారాణి మరణించింది. యుద్ధ సమయంలోనె గాంధీజీ 1940 లో వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభించాడు. డెసెంబర్ 9 వ తేదీన విజయలక్ష్మీ పండిట్ సత్యాగ్రహంలో చేరింది. అప్పుడు అరెస్టుచేసి ప్రభుత్వం ఆమెను నైనీ జైల్లో నాలుగు మాసాలుంచింది. దేశంలో ఈ రాజకీయ తుఫాను వతావరణంలో ఉండగానే జవహర్ లాల్ కుమార్తె ఇంధిరా గాంధీకి, ఫిరోజ్ ఖాన్ కు పెళ్ళి జరిగింది. ఆ సమయంలోనె క్రిప్సు రాయబారం చెడింది. 1942 ఆగష్టు తొమ్మిదవ తేదీన బాపూజీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానము చేసింది. భారతీయనాయకులందరూ గాంధీజీకి అండగా నిలబడేసరికి నాయకులందరినీ ప్రభుత్వం ఖైదు చేసింది. 1942 ఆగష్టు 12 వ తేదీన విజయలక్ష్మీ పండిట్ ను అరెష్టు చేశారు. చిన్నపిల్లలైన ఆమె కురార్తెలు భయమూ బాధా లేకపోగా తల్లికి ధైర్యం చెప్పి నైనీ జైలుకు పంపారు.
 
ఆమె
 
==జైలు జీవితంలో విజయలక్ష్మి==
"https://te.wikipedia.org/wiki/విజయలక్ష్మి_పండిట్" నుండి వెలికితీశారు