తూమాటి దోణప్ప: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 37:
==బాల్యము, విద్యాభ్యాసము==
దోణప్ప [[అనంతపురం జిల్లా]] [[రాకెట్ల]] లో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు ఎనిమిదవ సంతానంగా [[1926]],[[జూలై 1]]వ తేదీ జన్మించాడు. ఇతడి మొదటి పేరు '''దోణతిమ్మారాయ చౌదరి'''. తాతగారైన తూమాటి భీమప్ప గారి వద్ద చిన్ననాటనే మాఘం తప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివాడు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివాడు. భాగవత ప్రవచనం చేశాడు. [[వజ్రకరూరు]]లోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో 1939-42సం||ల కాలంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.1942-46సం||ల కాలంలో [[ఉరవకొండ]] లోని కరిబసవ స్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు. ఈ సమయంలో నూతలపాటి పేరరాజు అనే తెలుగుపండితుడు ఇతనికి గురువుగా ఉండేవాడు. అతడి నుండి ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. 1948లో [[అనంతపురం]]లోని [[దత్తమండల కళాశాల]]లో ఇంటర్మీడియట్లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు, కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, [[చిలుకూరి నారాయణరావు]] మొదలైనవారు ఇతని గురువులు. 1949-52సం||ల మధ్య [[ఆంధ్రవిశ్వవిద్యాలయం]]లో బి.ఎ. ఆనర్స్ చదివాడు. అక్కడ [[గంటి జోగి సోమయాజి]], [[దువ్వూరి వేంకటరమణశాస్త్రి]], కాకర్ల వెంకటరామ నరసింహం, [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూధన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి
==ఉద్యోగము==
ప్రభుత్వము నుండి ఉత్తమ ఆంధ్ర భాషాచార్యులు గా ప్రశంసా పత్రము, గౌరవాన్ని పొందిన దోణప్ప "ఆంధ్రుల అసలు కథ", "బాలల శబ్ద రత్నాకరం", "తెలుగు మాండలిక శబ్దకోశం", "భాషా చారిత్రక వ్యాసావళి", "ఆంధ్ర సంస్థానములు-సాహిత్యసేవ", "తెలుగులో కొత్త వెలుగులు", "జానపద కళా సంపద", "తెలుగు హరికథా సర్వస్వం", "తెలుగులో చేరిన ఇండో-ఆర్యన్ పదాలు", "దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట", "మన కళాప్రపూర్ణుల కవితారేఖలు", "ఆకాశవాణి భాషితాలు","తెలుగు వ్యాకరణ వ్యాసాలు" మున్నగు పలు రచనలు చేశాడు.
|