తూమాటి దోణప్ప: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==బాల్యము, విద్యాభ్యాసము==
దోణప్ప [[అనంతపురం జిల్లా]] [[రాకెట్ల]] లో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు ఎనిమిదవ సంతానంగా [[1926]],[[జూలై 1]]వ తేదీ జన్మించాడు. ఇతడి మొదటి పేరు '''దోణతిమ్మారాయ చౌదరి'''. తాతగారైన తూమాటి భీమప్ప గారి వద్ద చిన్ననాటనే మాఘం తప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివాడు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివాడు. భాగవత ప్రవచనం చేశాడు. [[వజ్రకరూరు]]లోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో 1939-42సం||ల కాలంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.1942-46సం||ల కాలంలో [[ఉరవకొండ]] లోని కరిబసవ స్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు. ఈ సమయంలో నూతలపాటి పేరరాజు అనే తెలుగుపండితుడు ఇతనికి గురువుగా ఉండేవాడు. అతడి నుండి ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. 1948లో [[అనంతపురం]]లోని [[దత్తమండల కళాశాల]]లో ఇంటర్మీడియట్‌లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు, కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, [[చిలుకూరి నారాయణరావు]] మొదలైనవారు ఇతని గురువులు. 1949-52సం||ల మధ్య [[ఆంధ్రవిశ్వవిద్యాలయం]]లో బి.ఎ. ఆనర్స్ చదివాడు. అక్కడ [[గంటి జోగి సోమయాజి]], [[దువ్వూరి వేంకటరమణశాస్త్రివేంకటరమణ శాస్త్రి]], కాకర్ల వెంకటరామ నరసింహం, [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూధన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి మొదలైన హేమాహేమీలు ఇతని గురువులుగా ఉండేవారు. 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.ఆనర్సులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని సాధించాడు. ఆ సమయంలో ఇతనికి అనకాపల్లి కళాశాల వారు మొట్టమొదటే ఆంధ్రశాఖ అధ్యక్షపదవి ఇస్తామని ఆహ్వానించారు. గుడివాడ కళాశాల వారు కూడా ఆహ్వానించారు. కాని ఇతడు ఈ రెండు అవకాశాలను కాదని [[గంటి జోగి సోమయాజి]]వద్ద పరిశోధకవిద్యార్థిగా చేరి "తెలుగులో వైకృతపదాలు" అనే అంశంపై పరిశోధించి 1966లో పి.హెచ్.డి సంపాదించాడు.
 
==ఉద్యోగము==
1957లో "తెలుగు వ్యుత్పత్తి పదకోశం" నిర్మాణ ప్రాజెక్టులో ముఖ్యసహాయకుడిగా చేరి 1961 వరకు పనిచేశాడు. 1958లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడిగా చేరాడు.1970లో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు. 1976లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు. 1970-76లో "తెలుగు వ్యుత్పత్తి పదకోశం" ప్రాజెక్టు ముఖ్యసంపాదకుడిగా ఉన్నాడు. 1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిష్ట్రారుగా, 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాలాధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా, అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరెక్టరుగా నియుక్తుడయ్యాడు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించబడ్డాడు. ఇతడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో అకడమిక్ బోర్డు సభ్యుడిగా, సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు.
"https://te.wikipedia.org/wiki/తూమాటి_దోణప్ప" నుండి వెలికితీశారు