ఇప్పగూడెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 143:
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
ఈ గ్రామం నుండి ప్రముఖులలో సిపిఎం పార్టీ నేత మంతెన నారాయణ రెడ్డి ఒకరు. గ్రామంలో సిపిఎం పార్టీని నిర్మించిన వారిలో ఆయన ముఖ్యుడు. కుందారం గ్రామంలో దొరసాని భూముల పంపకంతో ఆయన సిపిఎం నేతగా ప్రాచుర్యంలోకి వచ్చారు.జనగామ నుండి ఓసారి ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. గ్రామ సర్పంచ్ గా పనిచేశారు సమితి సభ్యునిగానూ పనిచేశారు.సిపిఎం జిల్లా కమిటీ సభ్యునిగా ఉన్న ఆయన అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.
హన్మకొండ ఎమ్మెల్యేగా పనిచేసిన మందాడి సత్యనారాయణ రెడ్డి ఇప్పగూడెం గ్రామవాస్తవ్యులే. ఆయన జనగామ నుండి బిజెపి తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోెయారు. అనంతరం టిఆర్ఎస్ ఆవిర్భావ సభ్యునిగా ఉన్న ఆయన 2004లో అనూహ్యంగా హన్మకొండ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. గొప్ప వాగ్దాటి గల ఆయన వైఎస్ ఆకర్ష్ లో భాగంగా టిఆర్ఎస్ లో అసమ్మతికి నాయకత్వం వహించారు.
కాకతీయ యూనివర్శిటీ లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న గుర్రం దామోదర్, తాటికొండ ఆశీర్వాదంలు ఇప్పగూడెం గ్రామానికి చెందిన వారే. వీరితో పాటు భౌతిక శాస్త్రం బోదనలో జిల్లాలోనే పేరొందిన కొల్లూరు శ్రీరాములు ఈ గ్రామానికి చెందిన వారే.
ఇంద్రజాలం (మ్యాజిక్) లో తెలంగాణ గర్వంచే వ్యక్తి జూలుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి. ‘‘గారడి’’ శ్రీనన్న ప్రజలు పిలుచుకునే ఆయన ఈగ్రామానికి చెందిన వారే. ఈయన పలు సార్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మ్యాజిక్ అవార్డులను అందుకున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇప్పగూడెం" నుండి వెలికితీశారు