వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/Documentation: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
=== నిపుణుల ఉపన్యాసం - 1 (శ్రీనివాస్ కల్లూరి గారి ఉపన్యాసం) ===
'''కల్లూరి శ్రీనివాస్''' గారు అన్నమాచార్యులు కీర్తనలు వికీపీడియాలో చేర్చడానికి జరుగుతున్న కృషిని గురించి వివరించారు. అన్నమయ్య కీర్తనలలో 28 భాగాలు అన్ని అందుబాటులో ఉండగా 29 వ భాగం మాత్రం చింపి ఉన్నాయని అయన తెలియజేశారు. అయితే ఈయన, కొంతమంది సభ్యులు కలిసి వాటన్నిటిని కలిపి ఒకే భాగంగా చేశారు. పూర్ణదయాళ్ అనే ఒక బ్యాంక్ ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి 14000 కీర్తనలను అను ఫాంటు నందు టైపు చేసి వీరికి అందించారు. వీటన్నిటిని కలిపి మార్చి 17వ తేదీన 200 పుస్తకాలన్నీ కూడా అచ్చువేసి కొంతమందికి ఉచితంగా అందజేస్తామన్నారు.
 
అన్నమయ్య చేసిన సంకీర్తనలన్ని రేకుల రూపంలో తంజావూరు గ్రంథాలయంలో ఉందనీ, ఒకే కీర్తన ఐదారుసార్లు, ఒక్కొక్క రాగంలో ఉంటుందని తెలియజేశారు. అన్నమయ్య కీర్తనలన్ని కూడ ఒక సీడీ రూపంలో పొందుపరచడం జరిగిందనీ, ఇవన్నీకూడా కీర్తన రూపంలో మాత్రమే కాకుండా వ్యాసరూపంలోకూడా చదవేందుకు ఆస్కారం ఉంటుందనీ, అన్నమాచార్యుల సంకీర్తనలో భార్యభర్తల మధ్య సంబంధాన్ని, భాదలను గురించి వివరించి మరియు అదే విధంగా ఎవరు ఎవరితో ఏ విధంగా మెలగాలో ఉంటుందని అన్నారు.