మొటిమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
* కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమవుతాయి. అలాగే ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
* కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే... కొద్దిగా పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.
* మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.
*పసుపు మహాద్బుతంగా చర్మాన్ని కాపాడే ప్రక్రియలొ సహాయపడుతుంది. మీ చర్మానికి మంట కలిగే ప్రదేశాలని చల్లగా చేసి, మచ్చలని తొలగించి, వాపు వచ్చిన ప్రదేశాలలో వాపుని కరిగించుటలో సహాయ పడుతుంది. మీ చర్మ చాయని పెంచి కోమలంగా మరియూ తేజోవంతంగా చేస్తుంది.
*మంచి గంధపుముక్కను చెక్కమీద సానతో అరగదీసి ఆ గంధమును ముఖానికి రాసుకున్నా లేదా పుదీనా ఆకులను రుబ్బి రాసుకున్నా కొద్దిసేపటి తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు <ref> [http://www.visalaandhra.com/women/article-56360 మొటిమలు - గంధపుముక్క]</ref> పోతాయి.
*జాజికాయను నీటిలో గంధంగా అరగదీసి మొటిమలకు రాస్తే మొటిమలు పోతాయి. <ref>[http://www.stylecraze.com/articles/simple-home-remedies-to-remove-pimples-overnight/ జాజికాయ] </ref> ముఖసౌందర్యం పెరుగుతుంది.
 
==మొటిమలతో జాగ్రత్తలు==
చూడటానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాదు.. మానసికంగానూ వేధిస్తాయి. అందుకే ముఖంపై ఒక్క మొటిమ కనబడినా వెంటనే గిల్లేస్తుంటారు. నిజానికి ఇలా గిల్లటం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి మొటిమలు గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
"https://te.wikipedia.org/wiki/మొటిమ" నుండి వెలికితీశారు