జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 144:
== జైనులకు మైనారిటీ హోదా ==
మైనారిటీ'లను నిర్వచిస్తూ రాజ్యాంగానికి సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా జైనులు మైనారిటీలుగా గుర్తింపు పొందేందుకు మార్గం సుగమం కానుంది. ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన19.12.2008 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మైనారిటీలను నిర్వచిస్తూ రాజ్యాంగానికి 103వ సవరణ చేపట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు హోంమంత్రి చిదంబరం తెలిపారు. జైనులకు మైనారిటీ హోదా కల్పించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ పలుసార్లు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో చట్టసవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.(ఆంధ్రజ్యోతి 20.12.2008)
 
== జైనుల కట్టడాలు-శిల్పము ==
 
జైనుల కట్టడాలలో ప్రతీదీ ఎంతో నేత్రపర్వంగా వుంటుంది. వారి ఆరామాలు, ఆలయాలూ, ఎక్కువ భాగం విశాల ప్రదేశాలలో నిర్మితాలు.వీఉ దేవాలయాలను సమూహాలుగా నిర్మిస్తారు. [[:en:Girnar|గిర్నరా]] శిల్పాలు బహు ప్రాచుర్యాన్ని పొందిన జైన శిల్పాలు. అదే విధంగా చిత్తూరులోని జయస్తంభాలు, ఆబూశిఖరం మీద ఆలయాలు మనోహర నిదర్సనాలు.బెంగాలులోని పార్శ్వనాధ విగ్రహ మున్న [[:en:Shikharji|సమేతశిఖర తీర్ధము]], పాట్నాలోని [[:en:Pawapuri|జలమందర]] తలమందర దేవాలయములు మరికొన్ని నిదర్సనాలు. జైన శిల్ప శిధిలాలలో ముందు మన దృష్టిని ఆకర్షించేవి [[:en:Udayagiri_and_Khandagiri_Caves|ఒరిస్సాగుహలు]]. వీటిలో చాలా భాగము తీర్ధంకర విగ్రహాలతో నిండి వున్నాయి. ఈ తీర్ధంకురులలో [[పార్స్వనాధుడు]] అత్యంత ప్రముఖ స్థానం పొందినది. ఈ గుహలలో త్రిశూలలు, స్తూపాలు, స్వస్తికలు, చక్రాలు, శ్రీదేవీ విగ్రహాలు, తదితర ప్రతీకలు ఉన్నాయి. జైనశ్రమణులు పెద్దపెద్ద సంఘాలుగా నివసించే ఆచారము లేదు. అందువలన బౌద్ధ చైత్యాలను పోలిన మందిరాలు వీరికవసరము లేకపోయినది. [[:en:Udayagiri_and_Khandagiri_Caves|ఉదయగిరిగుహలు]] చాలా ప్రాచీనమైనవి. ఖండగిరిలోనివి తరువాతి కాలములోనివి.ఉదయగిరిలోని హాతిగుంఫ చాల ప్రకృతిసిద్ధ మయినది. ఇందులో [[:en:Kharavela|ఖరవేల]] రాజ్యకాలం నాటి ఒక అపభ్రంశ ప్రాకృత శాసనము ఉంది. దానివల్లనే ఈగుహకు అంత ప్రాచుర్యము. ఈ గుహలోని శిల్పంలో మధుర శిల్పంలో వలెనే స్త్రీ పురుషుల వేష ధారణలలో గ్రీసుభారత శైలుల సమ్మిళితప్రభావం స్పష్టముగా కనిపిస్తుంది. ఈ శిల్పాలలో ఆభ్రణ సౌభాగ్యము, శాస్త్ర నైపుణ్యమేగాక అక్కడక్కడా వినూత్న భావశబలతా, జీవితసౌందర్యము, సునిశితహాస్యము, కూడా కనబడును.ఈ ఘట్టాలలో ఆఖేటమూ, యుద్ధమూ, నాట్యమూ, శ్ర్ంగారమూ, మొదలయిన జీవన శైలిలు కనబడును.
 
జైనశిల్పాలలో లేదా కట్టడాలలో రెండు ప్రత్యేక గుణాలు కనిపిస్తాయి-స్తూపారాధన, విగ్రహారాధన, స్తూపాలు ప్రధమంలో ప్రసిద్ధ మతాచార్యుల నిర్యాణచిహ్నాలుగానే పరిగిణింపబడినా క్రమంగా రానురానూ అసమానశిల్పకళానిలయాలుగా మారిపోయాయి.ఇందుకు మధురలోని వోద్వ స్తూపమే నిదర్సనము.స్తూప నిర్మాణము బౌద్ధులలో ఉన్నంత ప్రబలంగా జైనులలో లేక పోయినా వీరు కూడా ఇందులో ఒక ప్రశంసాపాత్రమైన స్థితిని చేరుకున్నారు.
 
జైనులకు వారి 24 తీర్ధంకరులు ముఖ్యమైన ఆరాధ్య దైవతాలు.కాని మహాయాన బౌద్ధులలోవలెనె వీరుకూడ భువనాధిపతులు, వ్యోమాంతరులు, వైమానికులు, జ్యోతిష్కులు అని చతుర్విధ విభాగంతో వ్యక్తమవుతున్న ఇంద్రుడు, గరుడుడు, గంధర్వులు, అప్సరసలు, సరస్వతి మొదలయిన హిందూ దేవతలను కూడా ఆరాధించేవారు.తీర్ధంకురుల విగ్రహాలకు ఒక్కొక్కదానికి అడుగున ఒక్కొక్క సంజ్ఞ ఉంటుంది. సామాన్యంగా అవి బుద్ధ ప్రతిమల వలె పద్మాసనస్థానములో చిత్రితములై ఉంటాయి.
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు