తూర్పు కొప్పెరపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
#శ్రీ జనార్ధనస్వామి ఆలయo:- ఈ ఆలయానికి 7.3 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. ఆదాయం-రు. 53,900-00. ఈ ఆలయం ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. పురాతన రథం శిధిలమైనది. రథశాల గతంలో కూలిపోయినది. వాహనశాల పునర్నిర్మాణం జరుగుచున్నది. [2]
#శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-6వ తేదీ శ్రావణ బుధవారం నాడు, ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా చతుర్వేద పారాయణం, అభిషేకాలు, విశేషపూజలు, ఆదిదంపతుల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల తాకిడితో సందడిగా మారినది. వేదపండితుల చతుర్వేద పారాయణతో ప్రాంగణం మారుమ్రోగినది. మల్లేశ్వరస్వామికి, భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకరణ చేపట్టినారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. [4]
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మే నెల-15వ తేదీ, శుక్రవారంనాడు, ఆలయ 17వ వార్షికోత్సవం, అత్యంత వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించినారు. స్వామివారిని 9 రకాల పుష్పాలతో అలంకరించి, కళ్యాణం నిర్వహించినారు. భక్తులు కళ్యాణ కానుకలు సమర్పించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినారు. [56]
 
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/తూర్పు_కొప్పెరపాడు" నుండి వెలికితీశారు