కరీంనగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
== జిల్లా చరిత్ర ==
[[నిజాం]] పరిపాలనలో కరీంనగర్ ఒక రాజధాని మరియు మాజీ భారత ప్రధానమంత్రి [[పి.వి.నరసింహారావు]], ప్రసిద్ధ కవులు [[సింగిరెడ్డి నారాయణ రెడ్డి]](సినారె), [[వేములవాడ భీమకవి]], గంగుల కమలాకర్, పొన్నమ్ ప్రబాకర్ వంటి పలు సుప్రసిద్ధ వ్యక్తులు ఈ జిల్లా వాస్తవ్యులే. [[గోదావరి]] నది ఈ ప్రాంత సౌందర్యమును మరింత ఇనుమడింపజేస్తున్నది. కరీంనగర్ [[గోండ్లు]], కోయలు, చెంచులు, లంబాడీలు, ఎరుకల, తొటి, మొదలైనటువంటి అనేక గిరిజన జాతులకు ఆవాసము. ఈ ప్రాంతీయులు సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో మంచి నిపుణులు.
 
నేటి కరీంనగర్ ప్రాంతాన్ని పూర్వం [[సబ్బినాడు]] అని వ్యవహరించేవారు. [[1905]]కు పూర్వము '' ఎలగందల్ జిల్లా''గా ప్రసిద్ధి చెందినది. 1905లో వరంగల్‌ జిల్లా నుండి పరకాల తాలూకాను జిల్లాలో కలిపి, [[లక్సెట్టిపేట]] మరియు చెన్నూరు తాలూకాలను అదిలాబాద్‌ జిల్లాలో, సిద్దిపేట తాలూకాను మెదక్‌ లో చేర్చి జిల్లాను 7 తాలూకాలతో పునర్‌వ్యవస్థీకరించి కరీంనగర్ జిల్లాగా నామకరణము చేశారు.
"https://te.wikipedia.org/wiki/కరీంనగర్_జిల్లా" నుండి వెలికితీశారు