కంప్యూటరు: కూర్పుల మధ్య తేడాలు

majo revision in progress
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[దస్త్రం:Computer-aj aj ashton 01.svg|thumb|నిత్యం వాడుకునే కంప్యూటరు యొక్క చిత్రము.]]
 
'''కంప్యూటరు''' అనునది అనేకమయిన ప్రక్రియల ద్వారా సమాచారమును రకరకాలుగా వాడుకోటానికి వీలు కలుగచేసే [[యంత్రం]]. సమాచారము వివిధ రూపములలో ఉండవచ్చును: ఉదాహరణకు సంఖ్యలుగా, బొమ్మలుగా, శబ్దములుగా లేదా అక్షరములుగా ఉండవచ్చు. 'కంప్యూటరు' అను ఆంగ్ల పదము కంప్యూట్ అనే పదము నుండి వచ్చినది. అలాగే తెలుగులో కూడా గణనము నుండి 'సంగణకము' అను పదమును కంప్యూటరుకు బదులుగా వాడవచ్చు.
 
== కంప్యూటర్ అంటే ఏమిటి? ==
కంప్యూటర్'''కంప్యూటరు''' అనునది అనేకమయిన ప్రక్రియల ద్వారా సమాచారమును రకరకాలుగా వాడుకోటానికి వీలు కలుగచేసే [[యంత్రం]]. సమాచారము వివిధ రూపములలో ఉండవచ్చును: ఉదాహరణకు సంఖ్యలుగా, బొమ్మలుగా, శబ్దములుగా లేదా అక్షరములుగా ఉండవచ్చు. ఈ రోజుల్లో "కంప్యూటర్" అనేది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఈ ఉపకరణాన్ని ఖచ్చితంగా నిర్వచించాలంటే కష్టతరమనేకష్టమనే చెప్పాలి. కంప్యూటర్ అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటర్ అని నిర్వచించటం కష్టమౌతుంది. మునుపు కంప్యూటర్ అని పిలువబడ్ద యంత్రాలు వేర్వేరు పనులకై ఉపయోగింపబడటం వలన కూడా ఫలానా పని చేసే యంత్రమే కంప్యూటర్‌ అని చెప్పటం కూడా కష్టమౌతుందనే చెప్పాలి. కానీ ఈ క్రింది నిర్వచనాల ద్వారా కంప్యూటరు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.
 
* కన్సైజ్‌ ఆక్స్‌ఫ‌ర్డు ఆంగ్ల డిక్షనరి కంప్యూటర్‌ను "ముందుగా నిర్ధారించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి (store), విశ్లేషించగల (process/analyze) ఒక ఎలెక్ట్రానిక్ పరికరం" అని నిర్వచిస్తోంది. ఈ నిర్వచనం కంప్యూటర్‌ను ఒక విశ్లేషణా యంత్రంగా లేక పరికరంగా చూస్తుంది.<ref>The Concise Oxford English Dictionary, http://www.askoxford.com/concise_oed/computer?view=uk, Accessed on 08.01.2009</ref>
* వెబ్‌స్టర్స్ ఆంగ్ల డిక్షనరి కంప్యూటర్‌కు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుదానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్‌ ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. ఈ నిర్వచనంలో నాన్‌-ఎలెక్ట్రానిక్ పరికరాలు కూడా కంప్యూటర్లు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది.<ref>Merriam Webster's Online Dictionary, http://www.merriam-webster.com/dictionary/computer, Accessed on 08.01.2009</ref>
పంక్తి 13:
 
== చరిత్ర ==
మొదట్లోరెండవ ప్రపంచ యుద్ధం తరువాత రోజులలో రెండు రకాల కంప్యూటర్లు వాడుకలో ఉండేవి. '''అంక కలన యంత్రాలు''' (digital computers), '''సారూప్య కలన యంత్రాలు''' (analog computers). మధ్యలో కొన్నాళ్ళపాటు '''సంకర కలన యంత్రాలు''' (hybrid computers) వచ్చాయి. పోటీలో అంక కలన యంత్రాలు గెలవటం వల్ల ఇప్పుడు 'అంక' అన్న విశేషణాన్ని తీసేసి మామూలుగా కలన యంత్రం అని కానీ, కంప్యూటర్‌గణనం అనిచేసేది కానీకనుక అంటున్నారు.సంగణకం అని మధ్యకాని కాలములోలేదా కంప్యూటరుకంప్యూటర్‌ "సంగణకము"అని అనేకానీ పేరుతో ప్రాచుర్యము పొందుతోందిఅంటున్నారు.
 
ఈ రోజుల్లో ఎక్కువ వాడుకలో ఉన్న కంప్యూటర్‌‌‌ను పోలిన యంత్రాలు మొట్టమొదట రెండవ ప్రపంచ యుద్ధం అంతం అయ్యే రోజులలో వెలిసేయి. పూర్వం ఈ కలన యంత్రాలు చాల భారీగా ఉండేవి. ఒకొక్క యంత్రానికి ఒకొక్క పెద్ద గది కావలసి వచ్చేది. పైపెచ్చు ఒక్కొక్కటి కోట్ల కొద్ది రూపాయలు ఖరీదు చేసేది. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన అధిస్థాపన (establishment) కనుక ఈ యంత్రాన్ని ఎంతోమంది ఉమ్మడిగా వాడుకొనే వారు. ఇటువంటి ఉమ్మడి యంత్రాలు ఇప్పుడూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఇటువంటి వాటిని ప్రత్యేక వైజ్ణానిక అవసరాలకు ఉపయోగించుతున్నప్పుడు '''సూపరు కంప్యూటరు''' అని, పెద్దపెద్ద సంస్థల వ్యాపార లావాదేవీలు (transactions) సంవిధానం (processing) చేస్తున్నప్పుడు '''మెయిన్ ఫ్రేము''' కంప్యూటరు అని సంభోదిస్తూ ఉంటారు. ఇవి అపరిమితమయిన గణన సౌకర్యాలు కలిగి ఉంటాయి.
 
ఈ రోజుల్లో కంప్యూటర్లు బాగా శక్తివంతమూ అయేయి, చవకా అయేయి; పైపెచ్చు బాగా చిన్నవీ అయేయి. దాని వల్ల భారీ యంత్రాల వాడుక పడిపోయింది; ఎవరి కంప్యూటరు వారే సొంతంగా కొనుక్కోగలిగే స్థాయికి ఎదిగేం. ఈ సొంత కంప్యూటర్లనే ఆంగ్లంలో personal computer అనీ, హ్రస్వంగా PC అనీ, తెలుగులో '''వ్యక్తిగత కంప్యూటరు''' అనీ అంటున్నారు. ఈ సొంత కంప్యూటర్లు బల్లమీద పెట్టుకునే రకాలు (desktop), ఒళ్ళో పెట్టుకునే 'ఉరోపరి' (laptop), చేత్తో పట్టుకునేవి (hand-held) అలా రకరకాల ప్రమాణాల్లో వస్తున్నాయి. పుస్తకం సైజులో ఉన్నవాటిని '''నోటుబుక్కు కంప్యూటరు''' అని పిలుస్తారు. ఇతర వస్తువులను నియంత్రించుటకు ఉపయోగించే వాటిని embedded computers అంటారు. ఉదాహరణకు డిజిటలు కెమెరాలు, ఉతికే యంత్రాలు (వాషింగు మెషీనులు) మొదలగు వాటిలో వాడే కంప్యూటర్లు '''ఎంబెడెడు కంప్యూటర్లు'''. అంతేకాదు పెద్ద విమానాలను సైతం నడిపే కంప్యూటర్లను ఎంబెడెడు కంప్యూటర్లు అనవచ్చు. పెద్దదైనా, చిన్నదైనా కంప్యూటరు పనిచేసే పద్ధతి ఒక్కటే. సిద్ధాంతమూ ఒక్కటే. మరొక విషయం. ఏపిల్ కంపెనీ వారి కంప్యూటర్లు ప్రాచుర్యం లోకి వచ్చిన తరువాత PC అంటే "ఏపిల్ కంపెనీవి కానివి" అనే అర్థం వచ్చేలా వాడుక పెరిగిపోయింది.
 
ఇంకా కొత్త కొత్త రకాల కంప్యూటర్లు పరిశోధన స్థాయిలో ఉన్నాయి. క్వాంటం శాస్త్రపు సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి క్వాంటం కంప్యూటర్లు. అలాగే DNA (అంటే జీవ కణాలలోని [[వారసవాహికలు]]) లో నిబిడీకృతమైన సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి DNA కంప్యూటర్లు.
===== కప్యూటర్లు: ఒక విహంగావలోకనం =====
 
పైపైకి వివిధ రూపాలలో వ్యక్తులుకంప్యూటర్లు కనిపించినా వారి ఆత్మ స్వరూపం ఒక్కటే. అలాగే కంప్యూటర్లు - పెద్దవయినా, చిన్నవయినా, భృహత్ యంత్రాలైనా, ఊరోపరులు (laptops) అయినా - మౌలికంగా అవి పనిచేసే సూత్రం ఒక్కటే. కంప్యూటర్లు మనం ఇచ్చిన సమాచారాన్ని తీసుకుంటాయి. ఆ సమాచారాన్ని జీర్ణించుకుని, జీర్ణమైన ఆ సమాచారాన్ని తిరిగి మనకి మరొక రూపంలో ఇస్తాయి. ఆవు మనం పెట్టిన గడ్డి తిని, జీర్ణించుకుని మనకి తిరిగి పాలు ఇచ్చినట్లే. మనలో చాలమందికి, ఇప్పటికీ, పెరట్లో ఆవులు ఉంటాయి. వాటికి గడ్డి మేపుతాం, కుడితి పడతాం, పాలు పిండుకుంటాం. ఆ మేత ఏమైంది? ఆ పాలు ఎలా తయారయ్యాయి అన్న విషయాలు మనం పట్టించుకోము. అదే విధంగా కంప్యూటర్‌ని కేవలం ఉపయోగించుకునే వారికి కంప్యూటరు లోగుట్టు తెలియక్కర లేదు. ఉపయోగించుకోవడం తెలిస్తే చాలు. కారు నడిపేవారందరికీ కార్లు ఎలా పనిచేస్తాయో తెలుస్తోందా? తెలియవలసిన అవసరం కూడ లేదు.
 
ఆవునికారు పెంచుకున్నప్పుడునడిపేవాడు దానికికొద్దో, గొప్పో తిండికారు పెడితేగురించి బాగాతెలుసుకుంటే పాలుకారుని ఇస్తుందోమరి తెలియాలి.కొంత పాలుబాధ్యతతో, పితకడంసమర్ధతతో తెలియాలినడపవచ్చు కదా. ఆవు సంరక్షణ కొంత తెలియాలి.! అలాగే కేవలం వాడుకకే వినియోగించినా కంప్యూటరు గురించి కొద్దో, గొప్పో తెలిసి ఉంటే ఆ యంత్రాన్ని ఎంతో దక్షతతో వాడుకోవచ్చు. అలాగే కారు నడిపేవాడు కొద్దో, గొప్పో కారు గురించి తెలుసుకుంటే కారుని మరి కొంత బాధ్యతతో, సమర్ధతతో నడపవచ్చు కదా!
 
పూర్వకాలంలో “కంప్యూటర్” (computer) అనే ఇంగ్లీషు పదాన్ని లెక్కలు చేసే వ్యక్తిని ఉద్దేశించి వాడేవారు; అంటే “కంప్యూట్” (compute) చేసే వ్యక్తి. బండిని తోలే వ్యక్తిని ఇంగ్లీషులో “డ్రైవర్” (driver) అనిన్నీ, కుండలు చేసే వ్యక్తిని “పాటర్” (potter) అనిన్నీ అన్నట్లే. క్రమేపీ లెక్కలు చెయ్యడానికి యంత్రాలు వచ్చేయి. మనిషి చేసే పనినే యంత్రాలు చేస్తూన్నప్పుడు అదే “కంప్యూటర్” అన్న పేరుని యంత్రాన్ని ఉద్దేశించి వాడడం మొదలు పెట్టేరు. ఈ రోజుల్లో కంప్యూటర్ అంటే యంత్రమే; మనిషి కాదు.
పంక్తి 30:
భారతీయ భాషలలో కలనం చెయ్యడం అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు వంటి లెక్కలు చెయ్యడం. మొదట్లో కంప్యూటర్లని నిర్మించినప్పుడు వాటి చేత అంకెలతో ఈ రకం కలన కలాపాలే చేయించేవారు. అందుకనే వాటిని అంక కలనయంత్రాలు (digital computing machines) అనేవారు. కాలక్రమేణా కలనయంత్రాల చేత తార్కికమైన కలన కలాపాలు (logical calculations) కూడ చేయించడం మొదలు పెట్టేరు. అందుకని వాటిని అంక-తార్కిక యంత్రాలు (arithmetic-logic machines) అన్నారు. కొన్నాళ్లు పోయిన తరువాత కంప్యూటర్ల చేత ఇంకా రకరకాల పనులు చేయించడం మొదలు పెట్టేరు. ఉదాహరణకి తెర మీద ఏది, ఎప్పుడు, ఎంతసేపు, ఎన్నిసార్లు చూపించాలో నిశ్చయించడం. కనుక ఈ రోజుల్లో కంప్యూటర్ అంటే ఇచ్చిన సమాచారాన్ని జీర్ణించుకుని కొత్త సమాచారాన్ని వెళ్లగక్కే యంత్రం (information processing machine) అని మనం అర్థం చెప్పుకోవచ్చు.
 
ఈ రోజుల్లో, భారతదేశంలో కొందరు, కంప్యూటర్‌ని “సంగణకం” అంటున్నారు. ఇక్కడ కంప్యూటర్ అన్న మాటనే తరచు వాడతాను. వాడుకలో కొన్ని మాటలు నలిగిన తరువాత తెలుగులో కొంప్యూటర్‌ని ఏమనాలి, కేలుక్యులేటర్‌ని ఏమనాలి అనే విషయాలు ఒక గాడిలో పడతాయి.
 
మనం కంప్యూటర్‌కి మేపే సమాచారం (information) రకరకాలుగా ఉండొచ్చు. ఉదాహరణకి “రేపు వర్షం పడుతుందా?” అన్న ప్రశ్నకి సమాధానం కావాలనుకుంటే ముందు కొంత విషయ సేకరణ చెయ్యాలి. ప్రస్తుతపు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియాలి: బయట ఎంత వేడిగా ఉంది? గాలి ఎంత జోరుగా వీచుతోంది? ఆకాశంలో మేఘాలు ఉన్నాయా? ఎలాంటి మేఘాలు? ఎంత ఎత్తులో ఉన్నాయి? వాతావరణ పీడనం ఎలా ఉంది? భారమితి ఏమిటి చెబుతోంది? సముద్రం హోరు పెడుతోందా? చంద్రుడు గుడి కట్టేడా? శివుడికి సహస్ర ఘటాభిషేకం చేసేరా? ఈ రకం విషయాల గురించి సమాచారం సేకరించి కంప్యూటర్‌కి ఇస్తాం. ఈ సమాచారాన్ని దత్తాంశాలు (data) అంటారు. ఈ సమాచారం అంతా ఆవుకి వేసే మేత లాంటిది. ఈ సమాచారాన్ని ఏమిటి చెయ్యాలో మనం కంప్యూటర్‌కి చెప్పాలి. పులుసు చేసే వ్యక్తికి పులుసులో పడే సంభారాల జాబితా ఇస్తే సరిపోతుందా? పులుసు చేసే పద్ధతి కూడ చెప్పాలి కదా. “నీళ్లు మరిగించు, చింతపండు వెయ్యి, చెంచాడు ఉప్పు వెయ్యి, చిటికెడు పసుపు వెయ్యి, ముక్కలు వెయ్యి, మరగనీ, పోపు వెయ్యి” ఇలా చెప్పాలి కదా. వీటిని ఆదేశాలు (instructions) అంటారు. సూక్ష్మంగా చెప్పాలంటే మనం కంప్యూటర్‌కి దత్తాంశాలు, ఆదేశాలు ఇవ్వాలి. వాటిని రంగరించి, జీర్ణించుకుని, మనకి కంప్యూటరు సమాధానాలు ఇస్తుంది. టూకీగా అదీ కంప్యూటర్ చేసే పని.
 
 
మనం కంప్యూటర్‌కి ఇచ్చే ఆదేశాలు సాధారణంగా మనం మాట్లాడుకునే భాషని పోలిన భాషలో ఉంటే బాగుంటుంది – అంటే ఇంగ్లీషులోనో, తెలుగులోనో, రష్యన్ లోనో అనుకోవచ్చు. కాని మనం కంప్యూటర్ ఎదురుగా నిలబడి, “పులుసు వండు” అని ఎంతలా అరిచినా కంప్యూటర్‌కి అర్థం కాదు. (ఆ రోజులు కూడ వస్తున్నాయి, కాని ప్రస్తుతానికి సినిమాలలో తప్ప నిజ ప్రపంచంలో కంప్యూటర్లు ఆ రకం పనులు చెయ్యడం లేదు.) “నీళ్లు మరిగించు, ఉప్పు వెయ్యి, చింతపండు వెయ్యి…” అని విడమర్చి చెప్పినా కంప్యూటర్‌కి అర్థం కాదు. మన మనస్సులో ఉన్న కోరికని కంప్యూటర్‌కి చెప్పడం అనేది చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే మనం ఏ మానవ భాషలో మాట్లాడినా అపార్ధాలకి అవకాశాలు ఎక్కువ.
 
మన మనస్సులో ఉన్న విషయం కంప్యూటర్‌కి అర్థం అయే భాషలో చెప్పడానికి ప్రత్యేకంగా తరిఫీదు పొందిన వ్యక్తులు కావాలి. వాళ్లనే మనం “ప్రోగ్రామర్లు” (programmers) అంటున్నాం. ఈ ప్రోగ్రామర్లు చేసే పని ప్రోగ్రాములు రాయడం. ప్రోగ్రాము అంటే కంప్యూటర్‌కి ఇచ్చే ఆదేశాలని ఒక క్రమ పద్ధతిలో పేర్చి రాయడం. ప్రోగ్రాము అంటే ఒక క్రమంలో ఉన్న ఆదేశాల సమాహారం. “ప్రోగ్రాము” అనే మాటకి “కార్యక్రమం” అనే తెలుగు మాట ఉంది. ఈ మాటని “వినోద కార్యక్రమం” వంటి ప్రయోగాలకి అట్టేపెట్టుకుని కంప్యూటర్‌కి మనం ఇచ్చే ఆదేశాలకి మరొక ప్రత్యేకమైన మాట వాడదాం. అందుకని వీటిని తెలుగులో “క్రమణికలు” అందాం. మన భాషలకి వ్యాకరణం ఉన్నట్లే ఈ కంప్యూటర్ భాషలకి కూడ వ్యాకరణం ఉంటుంది. ఆ వ్యాకరణ నియమాలని పాటిస్తూ క్రమణికలు రాయాలి. మేలు రకం క్రమణికలు రాయగలిగే వాళ్లకి మంచి గిరాకీ ఎప్పుడూ ఉంటుంది.
 
 
మనం కంప్యూటర్‌కి క్రమణికలు (programs), దత్తాంశాలు (data) ఇస్తాం. ఈ క్రమణికలు మనకి అర్థం అయే మానవ భాషకి దగ్గరలో ఉంటాయి. దత్తాంశాలు మనకి అర్థం అయే దశాంశ పద్ధతిలో ఉంటాయి. కాని కంప్యూటర్ కి ఇవేమీ అర్థం కావు. వీటన్నిటిని కంప్యూటర్‌కి అర్థం అయే భాష (machine language) లోకి మార్చి, ఒక క్రమంలో కంప్యూటర్‌కి అందజేస్తే అది సరిగ్గా పని చేస్తుంది. ఇదంతా పెద్ద తర్జుమా యంత్రాంగం. ఈ క్రమణికలని, వాటిని తర్జుమా చేసే యంత్రాంగాన్ని, కంప్యూటర్ చెయ్యవలసిన పనులన్నిటిమీదా అజమాయిషీ చేసే యంత్రాంగాన్నీ, …, అంతటిని కలిపి “సాఫ్ట్‌వేర్” (software) అని పిలుస్తారు.
 
 
కంప్యూటర్లని గురించి మాట్లాడేటప్పుడు “కఠినాంగం” (hardware), “మృదులాంగం” లేదా “కోమలాంగం” (software) అని స్థూలంగా రెండు భాగాలుగా విడగొట్టి మాట్లాడడం సంప్రదాయికంగా వస్తూన్న ఆచారం. బ్రహ్మ మనని పుట్టించినప్పుడు ఒక భౌతిక శరీరం ఇచ్చేడు, నుదిటి మీద ఒక రాత రాసేడు. మన భౌతిక శరీరం కఠినాంగం (గట్టి సరుకు), నుదిటి మీద రాసిన రాత మృదులాంగం (మెత్త సరుకు). రాయడానికి వీలైన నుదురు అనే గట్టి ఫలకం లేకపోతే బ్రహ్మ మాత్రం ఎక్కడ రాస్తాడు? అలాగని రాయడానికి పలక ఒక్కటీ ఉండి, దానిమీద రాయడానికి ఏమీ లేకపోతే ఆ ఖాళీ పలక ప్రాణం లేని కట్టెతో సమానం. కంప్యూటర్ రంగంలో “కఠినాంగం” అన్న మాటని ఇంకా విస్తృత భావంతో వాడవచ్చు. కంప్యూటర్ లోని భౌతిక విభాగాలన్నీ (అంటే మనం చేత్తో పట్టుకో దలుచుకుంటే మన పట్టుకి దొరికేవి) – అంటే తెర (screen), కుంచికపలక (keyboard), మూషికం (mouse), మొదలైనవన్నీ కఠినాంగాలే. పోతే, కఠినాంగం లేకుండా మృదులాంగానికి అస్తిత్వం లేదు. కాలు మోపడానికి కఠినాంగం ఆసరా లేకుండా కేవలం మృదులాంగం గాలిలో ఉందంటే అది దయ్యంతో సమానం అన్నమాట. ఈ రకం దయ్యాలని మనం “కంప్యూటర్ వైరస్‌లు” (computer viruses) అనవచ్చు.
Line 48 ⟶ 50:
మనం వంట చేస్తూన్నప్పుడు వంట సామగ్రి కోసం నిమిషనిమిషానికీ బజారుకి పరిగెట్టం కదా; వంటగదిలోనో, దగ్గరలో ఉన్న కొట్టు గదిలోనో దాచుకుంటాం. అలాగే వంట చేసే విధానాలు రాసిన పుస్తకం (పులుసు ఎలా చెయ్యాలో, పచ్చడి ఎలా చెయ్యాలో, అప్పాలు, అరిసెలు ఎలా చెయ్యాలో) కూడ వంట గదిలోనే అందుబాటుగా ఉంటే బాగుంటుంది కదా. అందుకని కలనయంత్రాలు కలనం చేస్తూన్నప్పుడు కావలసిన సరంజామా (అంటే దత్తాంశాలు, ఆదేశాలు) ఎక్కడో ఉంటే ప్రయోజనం లేదు; చేతికి అందుబాటులో ఉంటే బాగుంటుంది. అలాగని అన్నీ వంటగదిలో ఇమడవు కదా. అందుకని ముఖ్యంగా కావలసినవి, తరచుగా కావలసినవి దగ్గరగా పెట్టుకుంటాం; అప్పుడప్పుడు కావలసినవి కొట్టుగదిలో ఉంచుతాం, ఎప్పుడో కాని అవసరం లేనివి, అవసరం వెంబడి బజారుకి వెళ్లి తెచ్చుకుంటాం. అదే విధంగా కలన యంత్రాలు కూడ రకరకాల అమరికలతో కొంత సమాచారాన్ని దగ్గరగాను, కొంత సమాచారాన్ని దూరంగాను దాచుకుంటాయి. ఇలా తరతమ భేదాలని పాటిస్తూ సమాచారాన్ని నిల్వ చేసే పద్ధతిని నిల్వ సోపానక్రమం (storage hierarchy) అంటారు.
 
నిల్వ సోపానక్రమంలోసోపానక్రమం (storage hierarchy) లో చేతికి అందుబాటులో దాచుకునే స్తలాన్నిస్థలాన్ని కోశం (cache, కేష్) అంటారు. తరచుగా కావలసిన సమాచారాన్ని జోరుగా దాచుకుని (లేదా రాసుకుని), జోరుగా బయటకి తీసుకోడానికి (లేదా చదువుకోడానికి) వీలయే ప్రదేశాన్ని ప్రథమ స్థాయి కొట్టు (primary storage) అని అందాం. దీనినే ఇంగ్లీషులో మెయిన్ మెమరీ (main memory) అని కాని, రేం (RAM, Random Access Memory) అని కాని అంటారు. కలశంలో కలనం ఎంత జోరుగా జరుగుతోందో అంత జోరుగా ఈ కొట్టు సమాచారాన్ని కలశానికి అందజేయాలి. ఈ వివరాలన్నీ తరువాత చూద్దాం కాని ఒక్క విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. కంప్యూటర్‌కి విద్యుత్ సరఫరాని ఆపేసినప్పుడు ఈ ప్రాథమిక స్థాయి కొట్లో రాసుకున్న సమాచారం అంతా చెరిగిపోతుంది. కనుక కంప్యూటర్‌ని “ఆఫ్” చేసేసే ముందు ఈ కొట్లో దాచుకున్న దస్త్రాలని (files ని) మరొక చోట ఎక్కడైనా, చెరిగిపోని చోట, దాచు (రాసు) కోవాలి. ఇలా మరొక చోట రాసుకుందికి వీలుగా, ప్రాథమిక స్థాయి కొట్టుకి దన్నుగా, ద్వితీయ స్థాయి కొట్టు (secondary storage) మరొకటి ఉంటుంది. ఈ ద్వితీయ స్థాయి కొట్టుని నిర్మించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పళ్లేల దొంతిని వాడతారు కనుక దీనిని ఇంగ్లీషులో “డిస్క్ స్టోరేజ్” (disk storage) అంటారు. మనం వాడుకునే కంప్యూటర్‌లకి తప్పనిసరిగా ఒకటో, రెండో, ఈ రకం నిల్వ పళ్లేల సదుపాయాలు ఉంటాయి. వీటన్నిటి గురించి తరువాత నేర్చుకుందాం.
 
2. కలనయంత్రాలతో సమాచార రవాణా
"https://te.wikipedia.org/wiki/కంప్యూటరు" నుండి వెలికితీశారు