ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

→‎పూర్వపు పద్ధతి: లంకెలు తగిలించేను
పంక్తి 52:
పాశ్చాత్యులు మన దేశానికి వర్తకం చెయ్యటానికి వచ్చిన కొత్త రోజులలో దక్షిణ అమెరికా నుండి ఎన్నో మొక్కలని తీసుకువచ్చి మనకి పరిచయం చేసేరు. మిరపకాయలు, పొగాకు, బంగాళాదుంపలు, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, మొదలైనవి. ఈ పేర్ల వెనక చరిత్రని చూస్తే తెలుగువారిలో ఉన్న సృజనాత్మక శక్తి అర్థం అవుతుంది.
 
'''[[మిరపకాయలు'''|మిరపకాయ]]: మాంసాన్ని వండడానికి మిరియాలు ముఖ్యంగా కావాలి. ఆ మిరియాలు భారతదేశంలోనే దొరికేవి. భారతదేశపు పూర్వపు ఆర్ధిక ఔన్నత్యానికి మిరియాలే కారణం. తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ని పట్టుకున్నప్పుడు పాశ్చాత్యులు భారతదేశానికి వచ్చే దారి బందయిపోయింది. దానితో సముద్రపు దారి కనుక్కుందామనే ప్రయత్నంలో, దారిలో అడ్డుతగిలిన అమెరికాలో పడ్డారు. అక్కడ పచ్చగా, ఎర్రగా, కారంగా ఉండే కాయలని చూసి అవే మిరియాలు అనుకొని వాటికి మిరియపుకాయలు అని వారి భాషలో పేరు పెట్టుకున్నారు. మిరియాలని ఇంగ్లీషులో "పెప్పర్స్" అంటారు కనుక మధ్య అమెరికాలో కనిపించిన ఎర్రటి, పొడుగాటి కాయని "పెప్పర్ కార్న్" అన్నారు. ఆ మొక్కలని మన దేశం తీసుకు వచ్చేరు. అది మనం కని, విని, ఎరగని కొత్త మొక్క. తెల్లవాళ్లు దానిని "పెప్పర్ కార్న్" అన్నారు కనుక దానికి మనవాళ్లు మిరియపు కాయ అని పేరు పెట్టేరు. అదే మిరపకాయ గా మారింది.
 
'''[[పొగాకు]]:''' ఇది కూడ తెల్లవాళ్లు దక్షిణ అమెరికా నుండి తీసుకువచ్చిన మొక్కే. దీని ఇంగ్లీషు పేరు “టుబేకో” ని పూర్తిగా విస్మరించి మనవాళ్లు దీనికి శుద్ధ తెలుగులో, పొగాకు అని పేరు పెట్టేరు. ఈ పేరు పెట్టిన వ్యక్తినీ, "డ్రెడ్జర్" కి తవ్వోడ అని పేరు పెట్టిన వ్యక్తిని మనం ఎలా గౌరవించాలో నాకు తెలియటం లేదు.
సపోటా: ఈ పండు కూడ దక్షిణ అమెరికాదే. అక్కడా దీన్ని సపోటా అనే అంటారు. అచ్చుతో అంతం అయిన పేరు కనుక మన భాషలో ఇది చక్కగా ఇమిడి పోయింది. నేను మెక్సికోలో ఈ పండు పేరు విన్నప్పుడు మన తెలుగు పేరే వాళ్లు తస్కరించేరని అనుకున్నాను.
 
'''[[సీతాఫలం]], [[రామాఫలం''']]: ఈ రెండు కూడ దక్షిణ అమెరికా పళ్లే. వీటికి నోరు తిరగని పేర్లు ఏవో ఉన్నాయి. మనవాళ్లు వీటికి తెలుగు పేర్లు కాకుండా సంస్కృతం పేర్లు పెట్టేరు. తెలుగు పేరు అయితే చివర “పండు” అని వచ్చి ఉండేది. గమనించేరో లేదో ఈ రెండింటికే "ఫలం" అనే తోక ఉంది; మిగిలినవాటన్నిటికీ "పండు" తోకే!
తోక ప్రస్తావన వచ్చింది కనుక, సీతాఫలం, రామాఫలంతో పాటు హనుమాఫలం ఉంటే బాగుంటుందని అనిపించింది. ఉష్ణమండలాలలో పెరిగే మరొక పండు పేరు “స్టార్ ఫ్రూట్.” దీని స్వస్థలం శ్రీలంక. నున్నటి కాకరకాయ ఆకారంలో ఉండి అడ్డుకోతలో నక్షత్రాకారంలో ఉంటుందీ పండు. దీనికి హనుమాఫలం అని పేరు పెట్టేసిన తరువాత దీనిని తెలుగులో అంబాణంకాయ అంటారని వికీపీడియాలో చదివేను. అంబాణంకాయ పేరు కన్న హనుమాఫలం పేరు బాగులేదూ?