ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
==దుర్నామాలని సరిదిద్దటం==
పరిభాషలో వాడే ఇంగ్లీషులో "అతకని" పేర్లు తరచుగా తారసపడుతూ ఉంటాయి. ఏదైనా కొత్త విషయాన్ని పరిశోధించే మొదటి రోజుల్లో అవగాహన అస్పష్టంగా ఉంటుంది. అట్టి సమయాలలో, కేవలం అజ్ఞానం కొద్దీ, మనం అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అయినప్పుడు మనం తొందరపడి పెట్టిన పేరు అతకక పోవచ్చు. ఉదాహరణకి ఆస్ట్రేలియాలో చెట్ల మీద నివసించే ఒక జంతువు చూడడానికి బుల్లి ఎలుగుబంటిలా ఉందని దానికి “కొవాలా బేర్” అని పేరు పెట్టేరు. దరిమిలా ఆ జంతువు ఎలుగుబంటి జాతికి చెందనే చెందదని తెలిసింది; కాని పెట్టిన పేరు అతుక్కుపోయింది. ఇదే విధంగా పీనట్, కోకోనట్ అన్న మాటలు ఇంగ్లీషులో దుర్నామాలు. వృక్షశాస్త్రం దృష్టిలో “నట్” అనే మాట నిర్వచనంలో కోకోనట్ ఇమడదు. మనం తెలుగులో వాడే [[కొబ్బరికాకొబ్బరికాయ]] శాస్త్రీయంగా సరి అయిన ప్రయోగం; కొబ్బరికాయ “గింజ” కాదు, అదొక పండు. అదే విధంగా “పీనట్, గ్రౌండ్‌నట్” అనే మాటలు కూడ దుర్నామాలే (misnomers). మనం తెలుగులో వాడే [[వేరుసెనవేరుసెనగ]] అన్న పేరు నిజానికి దగ్గర. అంటే ఏమిటన్నమాట? ఈ సందర్భంలో ఇంగ్లీషు పేర్ల కంటె తెలుగు పేర్లు శాస్త్రీయంగా సరి అయినవి.
 
ఈ సందర్భంలో మరొక ఉదాహరణ. ఇంగ్లీషులో “బటర్ ఫ్లై” (butterfly) అన్న మాటకి ఆ పేరు ఎలా వచ్చిందో, దానికి తెలుగులో సీతా (శీతా?) కోక చిలక అన్న పేరు ఎలా వచ్చిందో తెలియదు కాని “బటర్ ఫ్లై” లో బటరూ లేదు, అది శాస్త్రీయంగా “ఫ్లై” కాదు. “సీతాకోక చిలక” లో సీత (శీత) లేదు, కోక లేదు, అది చిలక కాదు! అందువల్ల ఈ అనువాదంతో ఇబ్బందీ లేదు.