ఉప్పెన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
సుమారు 1956 ప్రాంతాలలో ఒకనాడు రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి కాని, వాన కాని లేవు. [[కాకినాడ]] ఇంజనీరింగు కాలేజీ ప్రాంగణంలోకి “టైడల్ వేవ్ వస్తోంది” అన్న గాలి వార్త విని చాల మంది విద్యార్థులు హాస్టల్ వదిలిపెట్టి పై ఊళ్లు వెళ్లిపోయేరు. తెల్లారి లేచి చూసుకుంటే టైడల్ వేవూ రాలేదు, చిట్టి కెరటమూ రాలేదని తేలింది.
 
ఈ అనుభవాల నేపథ్యంలో [[ఆటుపోట్లు]] (tides), [[ తుఫాను|తుపాను]] (cyclone), ఉప్పెన, [[టైడల్ వేవ్]], సునామీ, [[చక్రవాతం]] (tornado) అన్న మాటలకి నిర్దిష్టమైన అర్థాలు ఉన్నాయా లేక ఒక మాటకి బదులు మరొక మాట వాడెయ్య వచ్చా అన్న అనుమానం రాక మానదు. పామరులు, పాత్రికేయులు, పండిత వర్గాలు ఈ మాటలని అజాగ్రత్తగా వాడి కొంత గందరగోళానికి కారకులయ్యారు.
 
శాస్త్రంలో సందిగ్ధతకి తావు లేదు. అంతే కాదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో మనం ముఖ్యంగా చేసే పని “పేర్లు పెట్టడం.” అంటే, మన అనుభవ పరిధి లోకి వచ్చిన దృగ్విషయాలకి నిర్ద్వందంగా ఉండేటట్లు పేర్లు పెట్టడం. ఇప్పుడు ఇక్కడ గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్ధిష్టమైన అర్థాలు నిర్దేశిద్దాం.
"https://te.wikipedia.org/wiki/ఉప్పెన" నుండి వెలికితీశారు