వెన్నం జ్యోతి సురేఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
ఈమె 2015,మే-21 నుండి 24 వరకు, పాటియాలాలో, పంజాబ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ విశ్వవిద్యాలయాల విలువిద్య పోటీలలో పాల్గొని, ప్రథమ స్థానం సంపాదించినది. ముగ్గురు సభ్యుల బృందంలో ప్రథమ స్థానం సంపాదించి, ఈమె, ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్యా పోటీలకు ఎంపికై, దక్షిణ కొరియా దేశంలోని గ్యాంగ్ జూ నగరంలో నిర్వహించిన ప్రపంచ విశ్వవిద్యాలయల విలువిద్య ఫోటీలలో పాల్గొన్నది. గ్యాంగ్ జూ క్రీడా గ్రామంలో నిర్వహించిన వరల్డ్ యూనివర్సైడ్ గేంస్-2015 ప్రారంభ వేడుకలలో ఈమె భారత జట్టుకి నాయకత్వం వహించి, గౌరవ వందనం చేసినది. ఈ అరుదైన గౌరవం దక్కిన తొలి రాష్ట్ర క్రీడాకారిణి ఈమె. గ్యాంగ్ జూ క్రీడాగ్రామంలో జరిగిన ఈ వేడుకలలో 33 దేశాలకు చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. 2015,జులై-4 నుండి 8 వరకు నిర్వహించిన ఈ పోటీలలో పాల్గొన్న సురేఖ, మహిళా కాంపౌండ్ విలువిద్య పోటీలలో, వ్యక్తిగత ఒలింపిక్ పోటీలలో 5వ స్థానం, మిక్సెడ్ విభాగంలో రజతపతకం, జట్టు విభాగంలో 7వ స్థానంలో నిలిచినది. ర్యాంకిగ్స్ లో, 720 పాయింట్లకు గాను 682 పాయింట్స్ సాధించి 8వ స్థానంలో నిలిచినది. [1]&[3]
 
ఈమె డెన్మార్క్ దేశంలో 2015,జులై-26 నుండి ఆగష్టు-2 వరకు నిర్వహించిన ప్రపంచ విలువిద్యా పోటీలలో పాల్గొంటుంది. ఈమె 2015,జులై-4 నుండి 15 వరకు నిర్వహించు ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్య జట్టుకు ప్రాతినిధ్యం వహించినది. ఈ పోటీలలో ఈమె ఫైనల్సుకు చేరుకున్నది. [2]
 
==మూలాలు==