సంధ్యావందనం శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సంధ్యావందనం శ్రీనివాసరావు''' దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి విద్వత్ గాయకుడు. ఇతడు [[అనంతపురం]] జిల్లా [[పెనుకొండ]]లో [[1918]], [[ఆగష్టు 21]]న నారాయణరావు, గంగాబాయి దంపతులకు జన్మించాడు. [[దత్తమండల కళాశాల]]లో బి.ఎ.చదివాడు. తరువాత బి.ఎల్. కూడా చదివాడు. అనంతపురం కలెక్టర్ ఆఫీసులో కొంతకాలం గుమాస్తాగా పనిచేశాడు. అయితే సంగీతంపై మమకారంతో ఉద్యోగాన్ని వదిలివేసి టైగర్ వరదాచారి వద్ద శిష్యుడిగా చేరాడు. శ్రద్ధతో, ఉత్సాహంతో, పట్టుదలతో అనేక ప్రాచీన సంప్రదాయ కీర్తనలు సేకరించి, స్త్రీలపాటలు, పల్లెపదాలు అనేకం ప్రోదిచేసి వాటి ద్వారా ప్రాచీన రాగాల స్వరూపాలను కల్పన చేశాడు. ఇతడు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, సంస్కృతము, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాల నిర్వాహకుడిగా పనిచేశాడు. [[మద్రాసు]]లోని సంగీత ఉపాధ్యాయుల కళాశాలకు ప్రిన్సిపాల్‌గా కుడా పనిచేశాడు.
==రచనలు==
# వేదాలలో అప్సరస - గంధర్వులు<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0033/070&first=1&last=14&barcode=2020120033065| డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}