భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
=== తొలి నాళ్ళు ===
 
అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ లచే [[1980]] [[ఏప్రిల్ 6]]న భారతీయ జనతా పార్టీ స్థాపించబడినది. అటల్ బిహారీ వాజపేతి భాజపా తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. [[1984]]లో, [[ఇందిరా గాంధీ]] హత్య అనంతరం జరిగిన [[లోక్‌సభ]] ఎన్నికలలో[[కాంగ్రెస్ పార్టీ]] విజయదుందుభి మోగించగా, భాజపా 543 నియోజకవర్గాలలొ ఒకటి అవిభాజ్య [[ఆంద్రప్రదేశ్]] లోని [[హనుమకొండ]] కాగా, ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్ధి గెలుపొందిన [[గుజరాత్]] లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. [[హనుమకొండ]] నుంచే కాదు మొత్తం [[ఆంద్రప్రదేశ్]] రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి [[చందుపట్ల జంగారెడ్డి]]. ఇక ఆ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయ్యారు.543 నియోజకవర్గాలలొ కేవలం రెండింటిని గెలుపొందింది. [[లాల్‌కృష్ణ అద్వానీ]] రథయాత్ర ఫలితంగా [[1989]] లోక్‌సభ ఎన్నికలలో 88 సీట్లను గెలుచుకొని [[జనతాదళ్‌]]కు మద్దతునిచ్చి [[వీ.పీ.సింగ్]] నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అయింది. [[అయోధ్య]]లో రామజన్మభూమి మందిరాన్ని కట్టాలనే ప్రయత్నంతొ రథయాత్రలో ఉన్న అద్వానీని [[బీహార్]] ముఖ్యమంత్రి [[లాలూ ప్రసాద్ యాదవ్]] అరెస్టు చేసిన సందర్భాన [[అక్టోబరు 23]], [[1990]]న భాజపా తన మద్దతును వెనక్కితీసుకోగా తదుపరి నెలలో [[జనతాదళ్]] ప్రభుత్యం పడిపోయింది.
 
[[1991]] లోక్‌సభ ఎన్నికలలో మండల్, మందిర్ ప్రధానాంశాలుగా జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తన స్థానాలను 120కి పెంచుకొని ప్రధాన [[ప్రతిపక్షం]] గా మారింది. కాంగ్రెస్ [[మైనార్టీ ప్రభుత్వం]] గా పాలన కొసాగించింది. [[1996]] లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద రాజకీయ పక్షం గా అవతరించింది. అప్పటి [[రాష్ట్రపతి]] [[శంకర్ దయాళ్ శర్మ]] అటల్ బిహారో వాజ్‌పేయి ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించగా బి.జే.పి. ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం పొందుటలో విఫలమైంది. తత్పలితంగా వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే పతనమైంది. 13 రోజులు అధికారంలో ఉన్నప్పుడు భాజపాకు కేవలం మూడే మూడు మిత్రపక్షాలు (శివసేన, సమతాపార్టీ, హర్యానా వికాస్ పార్టీ) ఉండేవి.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు