కాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== జీవులపై కాంతి ప్రభావం ==
కాంతి పర్యావరణంలో ఒక ముఖ్య కారకం. జీవరాసులపై దీని ప్రభావం నిర్ధిష్టంగాను, దిశవంతంగాను ఉంటుంది. జీవుల పెరుగుదల, శరీరవర్ణం, చలనం, దృష్టి, ప్రవర్తన, కాంతి ఆవర్తిత్వం, సర్కేడియన్ రిథమ్స్ వంటి జీవక్రియలను కాంతి ప్రభావితం చేస్తుంది. మొక్కలలో పత్రహరితం అభివృద్ధికి, కిరణజన్య సంయోగక్రియకు, మొక్కలకు, జంతువుల పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా కాంతి అవసరం.<ref>{{cite book | title = Technische Biochemie - Die Biochemie und industrielle Nutzung von Naturstoffen| author = Oliver Kayser, Nils Averesch| publisher = Springer Spektrum | year = 2015 | isbn = 9783658055479}}</ref><ref>{{cite book | title =Biologia Vegetal, 8.ª Edição| publisher = Nova Guanabara | year = 2014 | isbn = 9788527723626}}</ref>
 
=== వర్ణత ===
జంతువులలో వర్ణత (Pigmentation) ను కాంతి ప్రేరేపిస్తుంది. భూమధ్య ప్రాంతంలో నివసించే [[మానవులు]] అధిక కాంతి తీవ్రతకు గురవుతారు. కాబట్టి వారి [[చర్మం]] ముదురు వర్ణం కలిగి ఉంటుంది. సమశీతోష్ణ ప్రాంతంలో నివసించే మానవులు తక్కువగా కాంతి తీవ్రతకు గురవుతారు. కాబట్టి వారి చర్మం తక్కువ వర్ణం కలిగి ఉంటుంది.<ref>{{cite book | title =Biologia Celular e Molecular, 5ª Edição | author = Carlos Azevedo , Claudio E. Sunkel| publisher = Lidel | year = 2012 | isbn = 9789727576920}}</ref>
 
సాధారణంగా [[జంతువు]]ల పృష్ఠభాగం గాఢమైన రంగులోను, ఉదరభాగం లేతరంగులోను ఉంటుంది. పృష్ఠబాగంపై ఎక్కువ కాంతి పడటం వల్ల అక్కడ వర్ణత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ దృగ్విషయాన్ని కాంతి రక్షక అనుకూలనాలు అంటారు. దీనివల్ల జంతువులు తమ శత్రువుల బారినుంచి రక్షించుకొంటాయి.
"https://te.wikipedia.org/wiki/కాంతి" నుండి వెలికితీశారు