జిల్లెళ్ళమూడి అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
 
== జననం ==
జిల్లెళ్ళమూడి అమ్మ [[మార్చి 28]], [[1923]] లో గుంటూరు జిల్లా [[మన్నవ]] అనే ఒక పల్లెటూరులో జన్మించారు. వివాహానంతరం జిల్లెళ్ళమూడి లో స్థిరపడారు.

అమ్మ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. అమ్మ 1960-85 లలో చాలా ప్రసిద్ధురాలు. అమ్మ , జిల్లెళ్ళమూడిలో ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలమీద ఉపదేశములు ఇచ్చుచుండెడివారు. భక్తులు ఆవిడను "అమ్మ" అని భక్తిగా పిలుచుకునేవారు.

1953లోనే అమ్మ తన నిర్యాణాంతరం ఎక్కడ ఉంచాలో తెలియచేశారు.అక్కడ అప్పుడే భక్తులు గుడి నిర్మాణం కొంతమేర చేపట్టారు. తరువాత 1985 లో అమ్మ నిర్యాణాంతరం పూర్తిస్థాయి గుడిని నిర్యించారు. ఆ గుడి పేరు "అనసూయేశ్వరాలయం". అమ్మ భౌతికంగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెల 5వ తేదీన భక్తులు అమ్మ పెళ్ళి రోజును ఘనంగా ఆ గుడిలో జరుపుకుంటున్నారు . గర్భ గుడిలో అమ్మ కు పూజలు జరుగుతున్నా య్ . అమ్మ 1985లో మరణంచిన తరువాత, అమ్మ బౌతిక కాయాన్ని, అమ్మ ఆదేశానుసారం ఆ గుడిలోనే ఖననం చేశారు. 1987లో ఖననం చేసిన ప్రదేశంలో అమ్మ నల్ల రాతి విగ్రహం నెలకొల్పారు.
అమ్మ భర్త పేరు నాగేశ్వరరావు గారు. ఆయన తన భార్యలో ఒక దివ్య మూర్తిని చూసి, అమ్మ భక్తుడిగా మారారు. కాని, "అమ్మ" మాత్రం, తన భర్త పాద పూజ చెయ్యటం కొనసాగించారు. భక్తులు, అమ్మ భర్తను "నాన్నగారు" అని పిలుచుకునేవారు. అయన, 1981లో మరణించారు.
 
"https://te.wikipedia.org/wiki/జిల్లెళ్ళమూడి_అమ్మ" నుండి వెలికితీశారు