మట్టి మనుషులు: కూర్పుల మధ్య తేడాలు

చి సినిమా కథ గురించిన వివరణ
లంకె జోడించబడింది
పంక్తి 17:
}}
 
ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్‌రావు దర్శకత్వం వహించిన మట్టిమనుషులు చిత్రం తెంగాణ గ్రామీణ వలస కార్మికుల జీవితాలకు అద్దం పట్టేదిగా నిలిచింది. కె.ముఖర్జీ, [[మణికొండ వేదకుమార్|మణికొండ వేదకుమార్‌]] నిర్మాణసారథ్యంలో రూపొందిన ఈ చిత్రం నాటి సామాజిక విలువలను చాటేదిగా ఉంది. అర్చన, మోహిన్‌ అలీ బేగ్‌, నీనా గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎ.కె.బీర్‌ సినిమాటోగ్రఫీ అందించారు. కార్మికులు ప్రధానంగా భవన నిర్మాణ కూలీల జీవితాలు ప్రధాన కథాంశంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రం డిప్లొమా ఆఫ్‌ మెరిట్‌ అవార్డును అందుకుంది. 1990లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ చిత్రం ప్రదర్శితమైంది.
పల్లె నుంచి పట్టణాలకు వలసలు, వడ్డీవ్యాపారులు, కార్మికులు, మధ్యవర్తులు, భవన నిర్మాణ రంగంలో ప్రమాదాలు, మహిళ వ్యథలు, సాయం పేరుతో చేసే మోసాలు...ఇలా జీవితాల్లోని ఎన్నో అంశాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. కమర్షియల్‌ సినిమాకు భిన్నంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది.
జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఓ గ్రామీణ నిరుపేద కార్మికురాలి ఆశలు ఎలా రాలిపోయాయో ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లుగా చూపింది. విలువలు వదిలేసిన భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక మహిళ జీవితాన్ని ఎలా ఛిద్రం చేసిందో ఇందులో చూడవచ్చు. మనుషుల్లో దిగజారిన విలువలు, వ్యసనాలు, వీడిపోని మమతలు, అంతులేని ఆవేదన...అన్నింటికీ ఇచ్చిన దృశ్యరూపమే ‘మట్టి మనుషులు’. ఈ సినిమా చూస్తుంటే తెరపై నిజజీవితం దర్శనమిస్తుంది. ఆయా పాత్రలు ప్రాణం పోసుకొని మన పక్కన సంచరిస్తున్నట్లుగా, మనం కూడా ఆ పాత్రల్లో ఒకరిగా అనిపిస్తుంటుంది.
"https://te.wikipedia.org/wiki/మట్టి_మనుషులు" నుండి వెలికితీశారు