లైఫ్ అఫ్ పై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''లైఫ్ అఫ్ పై''' అనేది 2001 లో రచింపబడిన ప్రసిద్ద నవల. యాన్‌ మార్‌ట్టెల్ ([[Yann Martel]]) దీని రచయిత. దీనిని అంగ్‌ లీ ([[Ang Lee]]) దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసారు. లైఫ్ అఫ్ పై అనేది ఒక వ్యక్తి యవ్వనతరుణ జీవీతంలో జరిగినవయస్సులోజరిగిన విచిత్ర సంఘటనల, అనుభవాల ద్వారా ఫై ఒక రచయితకు చెప్పే తన కథ.
 
==నటీనటులు==
పంక్తి 43:
 
=== సముద్ర ప్రయాణం===
ఆ లైఫ్ బోట్లో పై తో పాటూ ఒక [[జీబ్రా|చారలగుర్రం]] (జీబ్రా), ఒక [[ఒరాంగుటాన్]](Orangutan), ఒక [[దుమ్ములగొండి]] (హయీనా), ఒక పెద్దపులి కూడా చోటు సంపాదించుకుంటాయి. జీబ్రానీ చింపాంజీనీ హయీనా, హయీనాని పులీ తినెయ్యగా, చివరికి పులీ, పై పడవలో మిగులుతారు. పులి గారికి రిచ్చర్డ్ పార్కర్ (Richard Parker) అని ఓ మంచి పేరు కూడా ఉంది. మిగిలిన కథ అంతా ఆ పులితో, ఆ సముద్రంలో, పై కొనసాగించిన ప్రయాణపు వయినంతో నడుస్తుంది.

ఒక వైపు పై కి తను ఒంటరి కానందుకు కొంచెం సంతోషం, ఒకవైపు పులితో సావాసం చేస్తూ క్షణక్షణం గండంగా ఉన్న పై పటేల్ పై ముందున్నవి రెండు సమస్యలు… ఒకటి పులికి తను ఆహారం కాకుండా ఉండాలంటే, దానికి వేరే ఆహారం సమర్పించుకోవడం. రెండు ఆ చిన్న బోట్లో ఎవరి హద్దులు ఎంతవరకో, ఎవరు ఎవరికి యజమానో స్పష్టం చెయ్యడం.
 
రెండో దానికి తను జూ వాతావరణంలో పెరిగి, అక్కడ తండ్రి నుంచీ, ఉద్యోగుల నుంచీ గ్రహించిన ఏనిమల్ సైకాలజీ, ట్రైనింగ్ సమయానికి ఉపయోగపడ్డాయి. కానీ చుట్టూ అగాధం లాంటి మహా సముద్రంలో, పులి తినగలిగే ఆహరం సంపాదించడం ఎలా? పాపం దానికోసం పడరాని పాట్లు పడ్డాడు. శుద్ధ శాకాహారి అయిన తను, సముద్రంలో దొరికే చేపలూ, తాబేళ్ళూ పట్టి, వాటిని చంపి పులి ఆకలి తీరుస్తాడు. మొదటిసారి చేపను పట్టుకొని, దానిని చంపడానికి ఒక దుప్పటిలో చుట్టి, గొడ్డలితో కొట్టడానికి పడే సంఘర్షణ నుండి, పాశవికంగా వట్టి చేతులతో కొట్టి చంపగలిగే మనస్థితికి చేరుకుంటాడు. ఆ నేపధ్యంలో పడిన వేదన, నెమ్మదిగా ఆ పనికి అలవాటు పడి యాంత్రికంగానూ కొంచెం క్రూరంగానూ మారిన వైనం చదువుతుంటే కొంచెం వొళ్ళు జలదరిస్తుంది. జంతువుతో సమానంగా దొరికిన అడ్డమైన దాన్నీ తినడం … అసహ్యంతో పొట్టలో దేవేస్తుంది. కానీ అలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో మనిషికి వేరే దారి, విచక్షణ ఉండవు మరి.
"https://te.wikipedia.org/wiki/లైఫ్_అఫ్_పై" నుండి వెలికితీశారు