భోగరాజు పట్టాభి సీతారామయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
'''భోగరాజు పట్టాభి సీతారామయ్య''' ([[నవంబర్ 24]], [[1880]] - [[డిసెంబర్ 17]], [[1959]]) (Bhogaraju Pattabhi Sitaramayya) స్వాతంత్ర సమరయోధుడు, [[భారత జాతీయ కాంగ్రెస్]] అధ్యక్షుడు, [[ఆంధ్రా బ్యాంకు]] వ్యవస్థాపకుడు సీతారామయ్య [[నవంబర్ 24]] [[1880]] న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[గుండుగొలను]] గ్రామములో జన్మించాడు (అప్పు డు ఈ గ్రామం [[కృష్ణా జిల్లా]]లో భాగంగా ఉండేది). భారత జాతీయోద్యమ సమయంలో [[మహాత్మా గాంధీ|గాంధీజీ]] చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. [[1939]] లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ [[1948]] లో [[పురుషోత్తమ్‌దాస్ టాండన్]] పై విజయం సాధించాడు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, [[మధ్యప్రదేశ్]] [[గవర్నర్]] గా పనిచేశాడు. రాష్ట్రం బయట పనిచేసిననూ [[తెలుగు]] భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించిన పట్టాభి [[1959]], [[డిసెంబర్ 17]] న తుదిశ్వాస వదలాడు.
===బాల్యం===
[[పశ్చిమ గోదావరి జిల్లా]] [[గుండుకొలను]] గ్రామంలో [[1880]], [[నవంబర్ 24]] న ఆరువేల నియోగి బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించాడు. వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామపట్టాభిషేకం జరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు పట్టాభి సీతారామయ్య అనే పేరు పెట్టినారు. ప్రాథమిక విద్య స్థానికంగా [[బందరు]] లోనే చదివి ఉన్నత విద్యకై [[మద్రాసు]] (నేటి [[చెన్నై]]) వెళ్ళి [[మద్రాసు క్రైస్తవ కళాశాల]] నుండి బి.ఏ. డిగ్రీ పొందిన పట్టాభి ఎం.బి.సి.ఎం. డిగ్రీ సాధించి డాక్టరు కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు.
[[దస్త్రం:DSC01349.JPG|thumb|right|హైదరాబాద్, కోటిలో.... ఆంధ్రాబాంకు ముందున్న విగ్రహము]]
 
===స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడిగా===
చదువు పూర్తైన తర్వాత మచిలీపట్నంలో డాక్టరుగా ప్రాక్టీసు పెట్టాడు కానీ లాభదాయకమైన సంపాదనను వదులుకొని గాంధీజీచే ప్రభావితుడై బ్రిటిషు వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీలో పట్టాభీ గాంధీజీకి అతి సన్నిహితంగా ఉండేవాడు. 1939లో భారత జాతీయ కాంగ్రేసు పార్టీ అధ్యక్ష పదవికి అతివాద అభ్యర్ధి అయిన [[సుభాష్ చంద్రబోస్]] కు వ్యతిరేకముగా, [[మహాత్మా గాంధీ]] అభిమతానికి దగ్గరైన వాడిగా పట్టాభిని పోటీలో నిలబెట్టారు. అయితే నేతాజీ పెరుగుతున్న ప్రాబల్యం మరియు పట్టాభి స్వాతంత్ర్యానంతరం, తమిళ ఆధిపత్యమున్న కొన్ని జిల్లాలను భావి తెలుగు రాష్ట్రములో కలపటానికి మద్దతునిస్తున్నాడన్న భావన ఈయన ఓటమికి కారణమయ్యింది. పట్టాభి ఓటమి తన ఓటమిగా గాంధీజీ భావించి బాధపడ్డాడు. ఆ తరువాత మళ్ళీ [[1948]] లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో పురుషోత్తమ్‌దాస్ టాండన్ పై గెలిచి స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవతరించినాడు.