"తెలుగు సినిమా చరిత్ర" కూర్పుల మధ్య తేడాలు

→‎తెలుగు సినిమా 1960-1970: - లింకులు తగిలించాను
(→‎తెలుగు సినిమా 1960-1970: - లింకులు తగిలించాను)
సంగీతపరంగా ఘంటసాల, పెండ్యాల, ఎస్.రాజేశ్వరరావులతో బాటు కె.వి.మహదేవన్ పుష్కలంగా బాణీలందించారు. [[సత్యం]], [[టి.జి.లింగప్ప]], [[ఎస్.పి.కోదండపాణి]] కూడా చాలా చిత్రాలలో పనిచేశారు. [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న కధ]] చిత్రం ద్వారా గాయకుడుగా [[ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం]] తెలుగు సినిమాకు పరిచయమయ్యారు.
 
ఈ దశకంలోనే [[ముళ్ళపూడి వెంకటరమణ]], [[గొల్లపూడి మారుతీరావు]], [[భమిడిపాటి రాధాకృష్ణ]], [[రంగనాయకమ్మ]], [[కోడూరి కౌసల్యాదేవి]] ప్రభృతులు సినిమారంగంలో రచయితలుగా అడుగుపెట్టారు. పాటల రచయితలుగా [[సి.నారాయణ రెడ్డి]], దాశరధిలకు మంచి ఆదరణ కొనసాగింది.
 
దర్శకులలో [[బాపు]] ([[సాక్షి]]), [[కె.ఎస్.ఆర్.దాస్]] ([[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]]), [[కె.విశ్వనాధ్]] ([[ఆత్మగౌరవం]]), [[ప్రత్యగాత్మ]] ([[భార్యాభర్తలు]]), [[ఎమ్.మల్లికార్జునరావు]], ([[గూఢచారి 116]]), [[తాతినేని రామారావు]], ([[నవరాత్రి]]), [[పేకేటి శివరాం]] ([[చుట్టరికాలు]]) ఎన్నదగినవారు. నటుడు [[ఎస్.వి.రంగారావు]] రెండు సినిమాలకు ([[చదరంగం]], [[బాంధవ్యాలు]]) దర్శకత్వం వహించాడు. హీరోయిన్ [[సావిత్రి]] కూడా [[మాతృదేవత]] చిత్రానికి దర్శకత్వం వహించింది. అయితే [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో వెలువడిన [[మూగ మనసులు]] ఈ దశాబ్దపు సంచలన విజయం సాధించిన సినిమా. ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు కలసి చక్రవర్తి చిత్ర బ్యానర్‌పై నిర్మించిన సందేశాత్మక చిత్రాలు [[సుడిగుండాలు]], [[మరోప్రపంచం]] ఏమాత్రం విజయవంతం కాలేదు. జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు, రాజ్యం పిక్చర్స్ వారి నర్తనశాల అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడ్డాయి.
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/180053" నుండి వెలికితీశారు