అహల్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 19:
==శాపము==
[[File:Rama_releasing_Ahalya_from_curse.jpg|thumb|ఎడమ|రాముని పాదము రాయిని తాకిన తరువాత అహల్యగా మారుచున్నరాయి ]]
ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు. ఇంద్రుడి మోసం తెలియని అహల్య అందుకు అంగీకరిస్తుంది. అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని రాయిరారాయిలా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత ఆమె మోసపోయిందని గ్రహించి , [[త్రేతా యుగం]]లో మహా విష్ణువు [[శ్రీరాముడు|రాముని]] అవతారమెత్తి ఆయన పాదదూళిచే ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు. అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు.
 
==విమోచనం==
"https://te.wikipedia.org/wiki/అహల్య" నుండి వెలికితీశారు