పెదతుమ్మిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 108:
స్థానికంగా పునఃప్రతిష్ఠించిన ఈ ఆలయంలో 2015,ఫిబ్రవరి-8, ఆదివారం నాడు, విగ్రహాల పునఃప్రతిస్ఠా కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ, అత్యంత వైభవంగా నిర్వహించినారు. వేలాదిమంది భక్తుల "హరహర మహాదేవ" అను నినాదాల మధ్య, స్వామి అమ్మవారి విగ్రహాలతోపాటు, వీరభద్రుడు, భద్రకాళి, మాఘబంధం, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలతోపాటు, నవగ్రహాలను గూడా ప్రతిష్ఠించినారు. ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనం సందడిగా సాగినది. అర్చకుల వేదఘోష మధ్య, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో, బంటుమిల్లి మండలంతోపాటు, పరిసర మండలాలకు చెందిన వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. [3]
 
ఈ ఆలయంలోని లింగాకారస్వామివారికి రజత జటాజూటం సమకూరినది. స్థానిక ప్రముఖులు శ్రీ మట్టా నాగబాబు, విజయలక్ష్మి దంపతులు 4 కిలోగ్రాముల వెండితో దీనిని తయారుచేయించి, 2015,నవంబరు-16వ తేదీ సోమవారంనాడు, స్వామివారికి సమర్పించినారు. శివుని ఆకారం, దానిపైన నాగసర్పంతో కూడిన జటాజూటాన్ని తయారుచేయించి సమర్పించినారు. [5]
 
ఈ ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు, 2016,ఫిబ్రవరి-24వ తేదీ నుండి 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ మూడు రోజులూ ప్రత్యెక పూజాకార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా 26వ తేదీ శుక్రవారంనాడు స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించెదరు. [6]
 
===శ్రీ కళ్యాణ కోదండరామాలయం===
గ్రామంలోని సత్యనారాయణపురంలోని ఈ పురాతన ఆలయం శిధిలమవడంతో, దానిని తొలగించి నూతన ఆలయాన్ని నిర్మించినారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2015,మార్చ్-23వ తేదీ సోమవారం నాడు, పూజా కార్యక్రమాలు ప్రారంభించినారు. 25వ తేదీ బుధవారం ఉదయం 11-36 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించినారు. అనంతరం అన్నదానం నిర్వహించినారు. [4]
"https://te.wikipedia.org/wiki/పెదతుమ్మిడి" నుండి వెలికితీశారు