భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
అదే సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ పతాకాన్ని స్వల్పమార్పులతో - చరఖా స్థానంలో "ఆజాద్ హింద్" అన్న అక్షరాలు, ముందుకు దూకుతున్న పులి బొమ్మతో - వాడుకొంది. ఈ మార్పులు గాంధీ అహింసాయుత పద్ధతులకు, [[సుభాష్ చంద్ర బోస్]] వీరోచిత పద్ధతులకు గల తేడాను ప్రతిబింబిస్తాయి. ఈ త్రివర్ణపతాకం భారతదేశపు గడ్డమీద మొదటిసారిగా బోస్ చేత [[మణిపూరు]]లో ఆవిష్కరించబడింది.
 
స్వతంత్ర భారతదేశ జాతీయపతాకాన్ని నిర్ణయించడానికి రాజ్యాంగసభ, [[1947]] [[జూన్ 23]]న [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|బాబూ రాజేంద్ర ప్రసాద్]] అధ్యక్షతన [[మౌలానా అబుల్ కలామ్ ఆజాద్]], [[కె.ఎం.పణిక్కర్]], [[సరోజినీ నాయుడు]], [[రాజాజీ]], [[కె.ఎం.మున్షీ]], [[బి.ఆర్.అంబేద్కర్]] లతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ [[1947]] [[జూలై 14]]న కాంగ్రెస్ పతాకాన్నే అన్ని పార్టీలకు, మతాలకు ఆమోదయోగ్యమయ్యే మార్పులతో జాతీయపతాకంగా స్వీకరించాలని నిర్ణయించింది. దాంట్లో మతపరమైన సూచికలేవీ ఉండరాదని తీర్మానించింది. చరఖా స్థానంలో [[సారనాథ్]] స్థూపంలోని ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ కొత్త పతాకాన్ని స్వతంత్ర భారత జాతీయపతాకంగా ఉద్వేగభరిత వాతావరణంలో [[1947]] [[ఆగష్టు 15]] నాడు ఆవిష్కరించారు.
 
== పతాకాన్ని తయారుచేసే పద్ధతి ==
"https://te.wikipedia.org/wiki/భారత_జాతీయపతాకం" నుండి వెలికితీశారు