చల్లా రాధాకృష్ణ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు కృష్ణా జిల్లాలోని [[సోమవరప్పాడు]] గ్రామంలో 6 – 1 – 1929 న జన్మించారు.శర్మ తండ్రి సాంస్కృతాంధ్రాలలో, హిందీ లో అపారమైన పాండిత్యం గలవారు, అష్టావధాని, బహు గ్రంథ కర్త అయిన చల్లా లక్ష్మీ నారయణ శాస్త్రి . తల్లి అన్న పూర్ణకునుద్దియైన యశోదమ్మ.
==విద్యాభ్యాసం ==
ఈయన నాల్గవ తరగతి వరకు బందరులో[[బందరు]]లో చదివారు. మద్రాసుకు[[మద్రాసు]]కు ఇరవై మైళ్ళ దూరంలో [[చెంగల్పట్టు]] జిల్లాలోని పోన్నేరి గ్రామంలో ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివి ఆ తర్వాత నెల్లూరు వి.ఆర్. కళాశాలలో ఎం.పి.సి గ్రూపుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యాడు. తెలుగు సాహిత్యాన్ని ప్రధానాంశంగా తీసుకుని బి.ఎ చదివి 1950 లో డిగ్రీ పొందారు. నెల్లూరు లో విద్యార్ధిగా ఉండిన శర్మ ప్రాచ్య భాషా పరిషత్ కు కార్యదర్శిగా పని చేశారు.
నెల్లూరు లో దర్భా వెంకట కృష్ణమూర్తి, ధరణికోట వెంకట సుబ్భయ్య, పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి, నేలటూరి రామ దానయ్య ,గుంటూరులో జమ్మలమడక మాధవరామశాస్త్రి వంటి హేమా హేమీలు గురువులుగా లభించటం అదృష్టంగా పొంగిపోయేవాడు. చల్లా శర్మ మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు పూర్తి చేశాడు. నిడదవోలు వెంకటరావు పర్యవేక్షణలో “ Tamil element in telugu literature ’’ అనే అంశంపై పరిశోధన చేసి ఎం.లిట్ పొందారు. మద్రాసు విశ్వ విద్యాలయం నుంచే పర్యవేక్షకులు లేకుండా స్వయంగా “ The Ramayana in telugu and tamil- a comparative study ‘’ అనే అంశంపై పరిశోధన చేసి ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం పరీరక్షకులుగా పి.హెచ్.డి పొందారు. శర్మ మొదట్లో సత్యవేడు గ్రామంలో ఉన్నత పాఠశాలలో సైన్సు టీచర్ గా, తరువాత మద్రాసు సర్. త్యాగరాయ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు . 1957 నుంచి మద్రాసు లో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యాలయం కార్యదర్శిగా ఇరవై నాలుగు సంవత్సరాలు పని చేశారు . 1981 నుంచి మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యాక్షులుగా పని చేసి పదవీ విరమణ చేశారు .
 
పంక్తి 26:
‘‘ గర్వం-ప్రల్లదనం ’’ అయన నిఘంటువులో దొరకవు. స్నేహాన్ని సకలార్ధ సాధనంగా భావించేవారు. నిరాడంబర జీవనులు. భాషల ద్వారా జాతీయ సమైక్యతని సాధించిన బహుముఖ ప్రతిభావంతులు. చిన్నవాళ్ళ అభిప్రాయాల్ని కూడా స్వీకరించి ‘‘ బాలదపి సుభాషితం ’’ అనే సూక్తిని గౌరవించే ఈ మంచి మనిషి హఠాత్తుగా 20-10-1998 న ఈ లోకాన్ని విడిచి పెట్టినా ద్రావిడ సాహిత్యం ఉన్నంత వరుకు ఆయన అమరజీవులే.
శర్మ రచనలు :- శ్రీ రాధాకృష్ణ శర్మ దాదాపు తొంబై ఏడు పై చిలుకు రచనలు చేశారు. ఆర్ధిక స్తోమత అంతగా లేకున్నా వదాన్యుల, పుస్తక ప్రచురణ సంఘాల విద్యా సంస్థల సహకారం వల్ల ఇన్ని రచనలు వెలువడ్డాయి. ప్రచురణ కావలసినవి సుమారు పది వరుకు ఉంటాయి. మొత్తం మీద శత గ్రంథకర్త అనవచ్చు.
 
==రచనలు==
=== నవలలు ===