కొడాలి గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

Kodali_Gopalarao.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Missing source as of 1 April 2016 - Using VisualFileChange.).
పంక్తి 1:
'''కొడాలి గోపాలరావు''' (1925 - 1993) ప్రముఖ తెలుగు నాటక రచయిత. వీరు దాదాపు వందకు పైగా నాటకాలు, నవలలు రచించారు.<ref>కొడాలి గోపాలరావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 500-1.</ref>
==విశేషాలు==
దొంగవీరడు, ఛైర్మెన్, లంకెల బిందెలు వంటి నాటకాలు [[తెలుగు]] నాటక రంగంలో సంచలనాన్ని కలిగించినవి. ఈ నాటకాల రచయిత '''కొడాలి గోపాలరావు'''. తెలుగు నాటకరంగంలో శతనాటక కర్తగా, వేగవంతమైన రచయితగా కొడాలి గోపాలరావుకి పేరు ప్రఖ్యాతలున్నాయి. ఈ గ్రామీణ నాటకాలు రచించడంలో అందెవేసిన చేయి కొడాలి గోపాలరావు. గ్రామీణ ప్రజలు, వారిలో జమిందార్లు, రాజకీయ నాయకులు, వడ్డీ వ్యాపారస్తులు, కూలీలు, పేదలు వంటివారిని తన నాటకాలలో పాత్రలుగా, వారి జీవన చిత్రాన్ని, వారి మధ్య ఏర్పడే సంఘటనలు, సంఘర్షణలు అంతే సహజంగా రంగస్థలంపై ఆవిష్కరించిన ఘనత కొడాలిది.
కొడాలి గోపాలరావు [[గుంటూరు]] జిల్లా, [[తెనాలి]] తాలూకాలోని [[పెదరావూరు]] గ్రామంలో జన్మించారు. సహజంగానే [[తెనాలి]] ప్రాంతంలో నాటక కళ పట్ల ఆదరణ ఎక్కువ. ప్రతి ఒక్కరిలో నాటకం పట్ల కనీస అవగాహన, ఆసక్తి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో పుట్టిన కొడాలి సహజంగానే నాటకం పట్ల అవగాహన, ఆసక్తి కలిగించింది.
 
"https://te.wikipedia.org/wiki/కొడాలి_గోపాలరావు" నుండి వెలికితీశారు