పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1977 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు''' గొప్ప కవి, పండితుడు, అవధాని. ఆంధ్ర సంస్కృత భాషలలో ప్రవీణుడు. యాభైకి పైగా పుస్తకాలు వ్రాశాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=17021| గుంటూరు మండల సర్వస్వము - పేజీ 459]</ref>.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1897]], [[జూన్ 15]] కు సరియైన [[హేవిలంబి|హేవళంబ]] నామ సంవత్సర [[జ్యేష్ఠ బహుళ పాడ్యమి]] నాడు [[నెల్లూరు]] జిల్లా [[సంగం (నెల్లూరు జిల్లా)|సంగం]]లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు జగన్నాథాచార్యులు. తల్లి కావేరమ్మ. ఇతడు కాశ్యప గోత్రుడు. ఇతడు 1905 నుండి 1915 వరకు నాటకాలంకార శాస్త్రాలను [[కాశీ కృష్ణాచార్యులు|కాశీ కృష్ణాచార్యుల]] వద్ద, వ్యాకరణము పేరి పేరయ్యశాస్త్రి, నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి, వేదుల సూర్యనారాయణశాస్త్రుల వద్ద, తర్కశాస్త్రాన్ని వేమూరి రామబ్రహ్మశాస్త్రి, దెందుకూరి పానకాలశాస్త్రులవద్ద సంప్రదాయ గురుకుల పద్ధతిలో అధ్యయనం చేశాడు. 1916 నుండి 1936 వరకు గుంటూరు టౌన్ హైస్కూలులో తెలుగు పండితుడిగా, 1936 నుండి 1958 వరకు హిందూ కళాశాలలో సంస్కృతాంధ్ర పండితుడిగా, తరువాత కొంతకాలం గుంటూరు కె.వి.కె. సంస్కృత కళాశాలలో సంస్కృతాంధ్ర పండితుడిగా పనిచేశాడు. తరువాత శేషజీవితాన్ని పురాణ ప్రవచనము, గ్రంథరచనలలో గడిపాడు. ఇతడు [[1977]], [[ఫిబ్రవరి 2]]వ తేదీ అనగా [[నల]] నామ సంవత్సర [[మాఘ శుద్ధ చతుర్దశి]] నాడు గుంటూరులోని తన స్వగృహంలో మరణించాడు<ref name="అవధాన సర్వస్వం">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=214-223|edition=ప్రథమ|accessdate=30 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.