ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న [[:en:Cold War|ప్రచ్ఛన్న యుద్ధం (శీతల యుద్ధం)]]లో సమీకరణాల భాగంగా ఆఫ్ఘన్ ప్రభుత్వ వ్యతిరేక [[:en:Mujahideen|ముజాహిదీన్]] బలగాలకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ [[:en:Inter Services Intelligence|ఐ.ఎస్.ఐ]] ద్వారా అమెరికా సహకారాన్ని అందించడం ప్రారంభించింది. దానితో స్థానిక కమ్యూనిస్టు ప్రభుత్వానికీ-తమకూ 1978లో కుదిరిన ఒప్పందాన్ని పురస్కరించుకొని [[డిసెంబరు 24]], [[1979]]న దాదాపు లక్ష మంది [[సోవియట్ యూనియన్]] సేనలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో (స్థానిక ప్రభుత్వ రక్షణకై) ప్రవేశించాయి. వీరికి ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్టు అనుకూల ప్రభుత్వం సేనలు మరో లక్ష తోడైనాయి. ఫలితంగా 10 సంవత్సరాలు సాగిన (అంతర్)యుద్ధంలో 6 లక్షలు - 20 లక్షలు మధ్య ఆఫ్ఘన్ వాసులు మరణించారని అంచనా. 50 లక్షలు పైగా ఆఫ్ఘన్ వాసులు పొరుగు దేశాలకు శరణార్ధులుగా వెళ్ళారు. ప్రపంచదేశాలనుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికా, పాకిస్తాన్ ద్వారా, పెద్దపెట్టున ముజాహిదీన్‌కు అనేక విధాలుగా సహకారం అందించింది. 1989లో సోవియట్ సేనలు వెనుకకు మళ్ళాయి. ఇది తమ నైతిక విజయంగా అమెరికా భావిస్తుంది. తరువాత ఆఫ్ఘనిస్తాన్ అవుసరాలను అమెరికా దాదాపు పట్టించుకోలేదు. 1992 దాకా రష్యా మద్దతుతో [[:en:Najibullah|నజీబుల్లా]] ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగి <ref name="Columbia:Afghanistan:History">[http://www.infoplease.com/ce6/world/A0856490.html "Afghanistan: History"], ''Columbia Encyclopedia''.</ref> తరువాత పతనమయ్యింది.
 
అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితి కకావికలమయ్యింది. విద్యావంతులు, మేధావులు చాలామంది వలస పోయారు. నాయకత్వం కొరవడింది. తెగల నాయకత్వాలు తమలో తాము కలహించుకొంటూ దేశానికి నాయకత్వం కూడా వారే నిభాయించారు. 1994లోని1994 లోని ఘర్షణలోనే కాబూల్‌లో 10,000 మంది పైగా మరణించారు. నాయకత్వం కొరవడి రోజువారీ యుద్ధాలు, దోపిడీలు, లంచగొండితనం పెరిగిన అదనులో [[:en:Taliban|తాలిబాన్]] బలమైన శక్తిగా పరిణమించి, క్రమంగా వ్యాప్తి చెంది 1996లో కాబూల్‌ను తన వశంలోకి తెచ్చుకోగలిగింది. 2000నాటికి దేశంలో 95% భాగం వారి అధీనంలోకి వచ్చింది. దేశం ఉత్తర భాగంలో మాత్రం [[:en:Afghan Northern Alliance|ఉత్తర ఆఫ్ఘన్ సంకీర్ణం]] 'బదక్షాన్' ప్రాంతాన్ని ఏలుతున్నది. తాలిబాన్ [[:en:Islamic law|ఇస్లామిక్ న్యాయ చట్టాన్ని]] చాలా తీవ్రంగా అమలు చేసింది. ఈ కాలంలో ప్రజల జీవనం, స్వేచ్ఛ బాగా దెబ్బ తిన్నాయి. స్త్రీలకు, బాలికలకు ఉద్యోగాలు, చదువు నిషేధించారు. నియమాలను ఉల్లంఘించినవారికి దారుణమైన శిక్షలు విధింపబడ్డాయి. కమ్యూనిస్టులు దాదాపు తుడిచివేయబడ్డారు. అయితే 2001నాటికి [[గంజాయి]] ఉత్పాదన అధిక భాగం నిలిపివేయడంలో వారు కృతకృత్యులయ్యారు<ref>[http://opioids.com/afghanistan/index.html Afghanistan, Opium and the Taliban]</ref>.
 
=== 2001-తరువాత ఆఫ్ఘనిస్తాన్ ===
[[దస్త్రం:US soldiers stuck in sand in southern Afghanistan.jpg|thumb|200px|left|దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌ ఇసుకలో చిక్కుకుపపోయిన అమెరికా సైనికులు.]]
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు