ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 124:
[[:en:September 11, 2001 attacks|సెప్టెంబరు 11, 2001 లో అమెరికా నగరాలపై జరిగిన ఉగ్రవాదుల దాడుల]] అనంతరం అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లోని [[అల్-కైదా]] ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలను అంతం చేయడానికి [[:en:Operation Enduring Freedom|ఆపురేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్]] అనే మిలిటరీ చర్యను పెద్దయెత్తున మొదలుపెట్టింది. [[:en:Osama bin Laden|ఒసామా బిన్-లాడెన్‌ను]] తమకు అప్పగించకపోతే తాలిబాన్ల ప్రభుత్వాన్ని అంతం చేస్తామని బెదరించింది. ఇదివరకటి ఆఫ్ఘన్ ముజా్ిదీన్ నాయకులు, అమెరికా సైన్యం కలిపి నిర్వహించిన యుద్ధం ఫలితంగా [[:en:Hamid Karzai|హమీద్ కర్జాయి]] నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాడింది.
 
2002లో2002 లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ''[[:en:Loya Jirga|లోయా జిర్గా]]'' ద్వారా హమీద్ కర్జాయి తాత్కాలిక ప్రెసిడెంట్‌గా ఎన్నుకొనబడ్డాడు. 2003లో రాజ్యాంగం ఆమోదించబడింది. 2004 ఎన్నికలలో హమీద్ కర్జాయియే 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్' ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. 2005లో (1973 తరువాత జరిగినవి ఇవే ఎన్నికలు) సార్వత్రిక ఎన్నికల ద్వారా నేషనల్ అసెంబ్లీ ఏర్పరచబడింది.
 
దేశం పునర్నిర్మాణం జరుగుతున్నది కాని అనేక సమస్యలతో ఆఫ్ఘనిస్తాన్ సతమతమవుతున్నది. [[పేదరికం]], మౌలిక సదుపాయాల కొరత, దేశమంతటా ఉన్న [[:en:land mine|ల్యాండ్ మైనులు (భూమిలో పాతబడి ఉన్న బాంబులు)]], ప్రేలుడు పదార్ధాలు, ఆయుధాలు, చట్టవ్యతిరేకంగా సాగుతున్న [[:en:opium poppy|గంజాయి పెంపకం]], రాజకీయ అంతర్యుద్ధాలు, [[:en:Taliban insurgency|తాలిబాన్ల దాడులు]], మిగిలి ఉన్న [[:en:al Qaeda|అల్-కైదా]] ప్రభావం, (ప్రత్యేకించి ఉత్తరభాగంలో ఉన్న) అనిశ్చితి - ఇవి కొన్ని సమస్యలు.
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు